Advertisement

  • ఇతర బౌలర్లను ఇమిటేట్ చేసిన బుమ్రా.. ఆకట్టుకుంటున్న వీడియో

ఇతర బౌలర్లను ఇమిటేట్ చేసిన బుమ్రా.. ఆకట్టుకుంటున్న వీడియో

By: Sankar Wed, 09 Sept 2020 12:07 PM

ఇతర బౌలర్లను ఇమిటేట్ చేసిన బుమ్రా.. ఆకట్టుకుంటున్న వీడియో


క్రికెట్ ప్రపంచం లో ఆటగాళ్లకు తమదైన ప్రత్యేక యాక్షన్‌ ఉంటుంది. అందులోనూ బ్యాట్స్మెన్స్ కంటే బౌలర్లు బౌలింగ్ చేసే సమయంలో తమ తమ స్టైల్స్ పాటిస్తారు. అందులో కొంతమంది విచిత్రంగా బౌలింగ్ చేస్తూ పేరు సంపాదించుకుంటారు. అయితే భారత బౌలర్లలో జస్‌ప్రీత్‌ బుమ్రా వైవిధ్యమైన బౌలింగ్‌ యాక్షన్‌కు పెట్టింది పేరు.

ప్రస్తుతం యూఏఈ వేదికగా జరగనున్న ఐపీఎల్ 2020 కోసం అక్కడికి వెళ్ళాడు. అక్కడ ఆరు రోజుల క్వారంటైన్ తర్వాత శిక్షణ ప్రారంభించిన ముంబై ఇండియన్స్ ఆటగాళ్లు ప్రాక్టీస్ చేసే వీడియోలను తమ సోషల్ మీడియాలో పంచుకుంటుంది యాజమాన్యం. అలా నిన్న బుమ్రా కు సంబంధించిన ఓ వీడియోను ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. అందులో... బుమ్రా కొంతమంది బౌలర్ల బౌలింగ్ యాక్షన్ ను ఇమిటేట్ చేసాడు. అయితే బుమ్రా పేసర్.. కానీ తాను ఇమిటేట్ చేసిన యాక్షన్ స్పినర్లది.

ఇక ఈ వీడియోకు ''బుమ్రా ఎవరిని ఇమిటేట్ చేసాడు'' అని ముంబై ఇండియన్స్ అభిమానులను ప్రశ్నించింది. సెప్టెంబర్ 19 న ప్రారంభం కానున్న ఐపీఎల్ మొదటి మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ తో ముంబై ఇండియన్స్ తలపడనుంది.

Tags :
|
|
|

Advertisement