Advertisement

  • అలవాటులో పొరపాటు ..షేక్ హ్యాండ్ ఇవ్వబోయిన హోల్డర్

అలవాటులో పొరపాటు ..షేక్ హ్యాండ్ ఇవ్వబోయిన హోల్డర్

By: Sankar Thu, 09 July 2020 12:55 PM

అలవాటులో పొరపాటు ..షేక్ హ్యాండ్ ఇవ్వబోయిన హోల్డర్

కరోనా మహమ్మారి కారణంగా దాదాపు నాలుగు నెలలకు పైగా క్రికెట్ ఆటగాళ్లు మైదానానికి దూరంగా ఉన్నారు ..ప్రపంచ వ్యాప్తంగా కరోనా తీవ్రంగా విజృంభించడంతో కనీసం ఆటగాళ్లు ప్రాక్టీస్ చేయడానికి కూడా బయటకు రాలేకపోయారు ..అయితే ఇంగ్లాండ్ లో కరోనా పరిస్థితి తగ్గడంతో వెస్ట్ ఇండీస్ జట్టుతో టెస్ట్ సిరీస్ ఆడేందుకు ఆ జట్టును ఆహ్వానించింది ..అందుకు విండీస్ కూడా ఒప్పుకొని ఇంగ్లాండ్ లో అడుగుపెట్టింది ..

అయితే కరోనా కారణంగా క్రికెట్ లో ఐసీసీ చాల మార్పులు తీసుకొచ్చింది..అందులో మొదటిది మైదానంలో ఆటగాళ్లు షేక్‌హ్యాండ్స్ ఇచ్చుకోకూడదు. అలానే వికెట్ పడిన సమయంలో హైఫై‌, బౌలింగ్ సమయంలో బంతికి ఉమ్మురుద్దడాన్ని కూడా నిషేధించింది. ఈ మేరకు ఆటగాళ్లకి ఆ అలవాట్లని దూరం చేసేందుకు ఇంగ్లాండ్, వెస్టిండీస్ కోచ్‌లు ప్రాక్టీస్ సెషన్, వార్మప్ మ్యాచ్‌లను కూడా నిర్వహించారు. కానీ.. అలవాటులో పొరపాటుగా హోల్డర్ షేక్‌హ్యాండ్ ఇవ్వబోయాడు.

సౌథాంప్టన్‌లో బెన్‌స్టోక్స్ టాస్ ఎగురవేయగా.. మ్యాచ్ రిఫరీ ఇంగ్లాండ్ టాస్ గెలిచినట్లు ప్రకటించాడు. దాంతో.. ప్రొటోకాల్‌లో భాగంగా వెస్టిండీస్ కెప్టెన్ హోల్డర్.. ఇంగ్లాండ్ కెప్టెన్‌ బెన్‌స్టోక్స్‌ని అభినందించేందుకు షేక్‌హ్యాండ్ ఇవ్వబోయాడు. కానీ.. బెన్‌స్టోక్స్ అలెర్ట్‌ అవగా.. వెంటనే హోల్డర్ కూడా తన తప్పిదాన్ని గ్రహించాడు.ఆ తర్వాత ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ లో వికెట్ పడిన తర్వాత కూడా ఆటగాళ్లు హైఫై ఇచ్చుకున్నారు ..అయితే చాల కాలం తర్వాత మ్యాచ్ జరుగుతుండటంతో ఆటగాళ్లు అలవాటులో ఇలా చేసారు ..అయితే ఆటగాళ్లు షేక్‌హ్యాండ్, హైఫైకి బదులుగా మోచేతిని తాకిస్తూ అభినందనలు తెలుపుకోవాలని ఐసీసీ సూచించింది.

Tags :
|

Advertisement