Advertisement

  • అధికారికంగా జపాన్ ప్రధాని షింజో అబే శుక్రవారం రాజీనామా

అధికారికంగా జపాన్ ప్రధాని షింజో అబే శుక్రవారం రాజీనామా

By: chandrasekar Sat, 29 Aug 2020 09:46 AM

అధికారికంగా జపాన్ ప్రధాని షింజో అబే శుక్రవారం రాజీనామా


దీర్ఘ కాలంగా జపాన్ ప్రధాని పదవిలో వున్న షింజో అబే రాజీనామా చేశారు. ఆరోగ్య సమస్యల కారణంగా తాను పదివి నుంచి వైదొలుగుతున్నట్లు జపాన్ ప్రధాని షింజో అబే శుక్రవారం అధికారికంగా ప్రకటించారు. పెద్ద ప్రేగులో కణితి ఏర్పడటంతో ఈ మధ్య ఆరోగ్యం మరింత క్షీణించి ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు ఆయన పేర్కొన్నారు. గత నెల రోజులుగా నా ఆరోగ్య పరిస్థితి పూర్తిగా మారింది. ఈయన భారత్ తో మంచి సంబందాలను కలిగి వున్నారు.

అనారోగ్యం కారణంగా శారీరకంగా బాగా అలసిపోతున్నాను. వైద్యులను సంప్రదిస్తే వ్యాధి తిరగబడింది అని చెప్పారని ఆయన స్థానిక మీడియాకు తెలిపారు. ప్రజలు తనపై పెట్టిన బాధ్యతలను పూర్తిస్థాయిలో నిర్వర్తించలేక పోతున్నందున పదవిలో కొనసాగకూడదని నిర్ణయించుకున్నానని వెల్లడించారు. రాజకీయాల్లో ఫలితాలను సాధించడం చాలా ముఖ్యమని, అనారోగ్యం కారణంగా రాజకీయ నిర్ణయాల్లో తాను విఫలమయ్యానని ఆవేదన వ్యక్తం చేశారు. తన పదవీ కాలం పూర్తి చేయలేకపోయినందున ప్రజలకు క్షమాపణలు చెప్పారు.

Tags :

Advertisement