Advertisement

  • అనారోగ్య సమస్యలతో జపాన్ ప్రధాని షింజో అబే రాజీనామా !

అనారోగ్య సమస్యలతో జపాన్ ప్రధాని షింజో అబే రాజీనామా !

By: Sankar Fri, 28 Aug 2020 3:31 PM

అనారోగ్య సమస్యలతో జపాన్ ప్రధాని షింజో అబే రాజీనామా !


జపాన్ ప్ర‌ధాని షింజో అబే రాజీనామా చేయనున్నట్టు సమాచారం. తీవ్ర అనారోగ్యం వల్లనే ఆయన ప‌ద‌వి నుంచి వెదొలుగుతున్న‌ట్టు తెలిపింది. ఈ విష‌యాన్ని జపాన్ జాతీయ మీడియా ఎన్‌హెచ్‌కె శుక్రవారం ధ్రువీక‌రించింది. దీంతో ప్ర‌స్తుత‌ం ఉప ప్రధానిగా ఉన్న తారో అసో తాత్కాలిక ప్రధానిగా బాద్యతలు చేపట్టనున్నారు.

నాలుగు రోజుల క్రితం తీవ్ర అనారోగ్య సమస్యలతో ప్రధాని షింజో అబే టోక్యోలోని ఆస్పత్రిలో చేరిన సంగ‌తి తెలిసిందే. దీంతో ఆయ‌న ఆరోగ్యంపై ప‌లు ఊహాగానాలు తెర‌పైకి వ‌చ్చాయి. అయితే ఈ వార్తలను ప్రభుత్వం ఖండించింది. ఆయన కేవలం జనరల్‌ చెకప్‌ కోసం వచ్చినట్లు, అబే ఆరోగ్యం క్షేమంగానే ఉందని ఆర్థికమంత్రి కట్సునోబు కటో తెలిపారు. దీంతో ప్ర‌ధాని రాజీనామా చేయ‌నున్నారనే వార్తలకు ‌బలం చేకూర్చిన‌ట్ల‌యింది.

త‌న అనారోగ్యం ప్ర‌భుత్వ కార్య‌క‌లాపాల‌కు ఇబ్బందిగా మార‌కూడ‌ద‌నే ప్ర‌ధాని షింజో భావిస్తున్న‌ట్లు తెలుస్తోంది. మ‌రికాసేప‌ట్లో దీనికి సంబంధించి ఆయ‌న మీడియాతో మాట్లాడే అవ‌కాశం ఉంది. 2021 సెప్టెంబ‌రు వ‌ర‌కు ప్ర‌ధానిగా ఆయన ప‌ద‌వీకాలం ఉంది. ఇదిలా ఉండగా దేశంలో ఎక్కువ కాలం ప్రధానమంత్రిగా కొనసాగిన వ్యక్తిగా అబే రికార్డు సృష్టించారు.

Tags :
|
|

Advertisement