Advertisement

  • చరిత్రలో మునుపెన్నడూ చూడని పెనువిధ్వంసం హిరోషిమా అణుబాంబు దాడికి నేటితో 75 ఏళ్ళు

చరిత్రలో మునుపెన్నడూ చూడని పెనువిధ్వంసం హిరోషిమా అణుబాంబు దాడికి నేటితో 75 ఏళ్ళు

By: Sankar Thu, 06 Aug 2020 12:30 PM

చరిత్రలో మునుపెన్నడూ చూడని పెనువిధ్వంసం హిరోషిమా అణుబాంబు దాడికి నేటితో 75 ఏళ్ళు



రెండవ ప్రపంచ యుద్ధం అనగానే అందరికి గుర్తొచ్చేది అమెరికా జపాన్ మీద అణుబాంబులు విసిరిన సంఘటనలు ..ప్రపంచం అంతకు ముందు ఎప్పుడు చూడని విధ్వసం అది ..ఆ తర్వాత కూడా అంత పెద్ద విధ్వంసాన్ని ఇంతవరకు చూడలేదు ..ఆ అణుబాంబు దాటికి ఇప్పటికి కూడా అక్కడ ప్రజలు ఎవరో ఒకరు ప్రభావితం అయితునే ఉన్నారు అంటేనే తెలుస్తుంది అంది ఎంత పెను విధ్వంసమొ ..నేటితో ఆ విధ్వంసానికి 75 ఏళ్ళు పూర్తి అయ్యాయి..

జపాన్‌ స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 8 గంటల 15 నిమిషాలకు బీ-29 బాంబర్‌ ఎనోలా గే.. నాలుగు టన్నుల యురేనియంతో కూడిన బాంబు లిటిల్‌ బాయ్‌ను అమెరికా హిరోషిమాపై ప్రయోగించింది. 9600 మీటర్ల ఎత్తు నుంచి నగరం నడిబొడ్డున ఉన్న అయోవి బ్రిడ్జ్‌ని లక్ష్యంగా చేసుకుని బాంబును జార విడిచింది. బ్రిడ్జి పైనుంచి కేవలం 600 మీటర్ల ఎత్తులో 43 సెకన్లలోనే లిటిల్‌ బాయ్‌ పేలాడు.

దీంతో ఒక్కసారిగా భారీ విప్ఫోటనం సంభవించింది. దాదాపు రెండు కిలోమీటర్ల మేర అంతా సర్వనాశనమై పోయింది. మంటల(3-4 వేల డిగ్రీ సెల్సియస్‌ ఉష్ణోగ్రతలు) ధాటికి అంతా కాలి బూడిదై పోయారు. నగరమంతా పొగతో నిండిపోయింది. విస్పోటనం తర్వాత గంట సేపటి వరకు రేడియోధార్మిక కణాల వర్షం కురుస్తూనే ఉంది.

హిరోషిమాలో లిటిల్‌ బాయ్‌ విధ్వంసం ధాటికి డిసెంబరు 31, 1945 వరకు దాదాపు లక్షా నలభై వేల మంది మృతి చెందినట్లు అంచనా. నాటి నగర జనాభాలో(ఆనాటికి 3,50,000) 40 శాతం ఇది. ఘటన సంభవించిన ప్రదేశం నుంచి అర కిలోమీటర్‌ దూరంలో ఒక్క ప్రాణి కూడా మిగల్లేదు..

యురేనియం తాలూకు దుష్పరిణామాల వల్ల బాంబు దాడిలో బతికి బయటపడ్డ వారి జీవితం డిసీజ్ ఎక్స్ అనే రోగంతో నరకప్రాయంగా మారింది. రక్తపు వాంతులు, జుట్టు రాలిపోవడం వంటి లక్షణాలతో దాదాపు ఆరు వారాల్లోనే చాలా మంది చనిపోయారు. మిగిలిన వాళ్లు కూడా దినదినగండంగానే వెళ్లదీశారు. వివిధ రకాల క్యాన్సర్లు, ఇతరత్రా అనారోగ్య కారణాలతో దయనీయ జీవితం గడిపారు.

ఆగస్టు 6న హిరోషిమాపై లిటిల్‌ బాయ్ అనే అణుబాంబును ప్రయోగించిన అమెరికా.. దాని నుంచి తేరుకునేలోగా నాగసాకి పట్టణంపై ఫ్యాట్‌ మ్యాన్‌ అనే మరో అణుబాంబును ప్రయోగించి తమ రాక్షసత్వాన్ని ప్రదర్శించింది.

Tags :
|
|
|

Advertisement