Advertisement

  • యూకే నుంచి వచ్చే విమానాలపై నిషేధం విధించిన జపాన్

యూకే నుంచి వచ్చే విమానాలపై నిషేధం విధించిన జపాన్

By: Sankar Wed, 23 Dec 2020 9:03 PM

యూకే నుంచి వచ్చే విమానాలపై నిషేధం విధించిన జపాన్


కరోనా ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. కరోనా రెండో విడతకే ప్రపంచదేశాలు తట్టుకోలేక పోతున్నాయి. ఇటువంటి సమయంలో మధ్యఆసియా దేశాలలో కరోనా కొత్త రకం వెలుగు చూసింది. దీనిని అరికట్టడంలో ఆయా దేశాలు విఫలమయ్యాయి.

దాంతో యూకే నుంచి రానున్న విమానాలను అనేక దేశాలు నిలిపివేశాయి. ఈ జాబితాలోకి కొత్తగా జపాన్ కూడా చేరింది. అయితే జపాన్ విదేశాల నుంచి వచ్చే స్వదేశీయులపైన కూడా బ్యాన్‌ను విధించింది. ఈ నిర్ణయాన్ని జపాన్ ఇటీవల తీసుకుంది. రేపటి నుంచి రానున్న అన్ని యూకే విమానాలను నిలిపివేయనుంది.

ఈ విషయాన్ని జపాన్ కాబినెట్ సెక్రటరీ కాత్సునోబు కాటో తెలిపారు. అంతేకాకుండా ఆదివారంలోపు రానున్న వారు 72 గంటల ముందు కరోనా పరీక్ష చేయించుకోవాలని ఇక్కడి వచ్చాక ఆ పరీక్ష ఫలితాలను చూపాలని తెలిపారు. అయితే ఇటువంటి నిబంధనలను ఇప్పటికి అనేక దేశాలు విధించాయి. దీనికి కొత్త కరోనా రకమే కారణం. దీనిని ప్రపంచదేశాలు ఎలా ఎదురుకోనున్నాయో వేచి చూడాలి

Tags :
|
|
|

Advertisement