Advertisement

  • గాలిలో ఎగిరి క్యాచ్ పట్టిన జాంటీరోడ్స్... ట్విట్టర్లో ప్రశంసల జల్లు...

గాలిలో ఎగిరి క్యాచ్ పట్టిన జాంటీరోడ్స్... ట్విట్టర్లో ప్రశంసల జల్లు...

By: chandrasekar Wed, 16 Sept 2020 10:24 AM

గాలిలో ఎగిరి క్యాచ్ పట్టిన జాంటీరోడ్స్...  ట్విట్టర్లో ప్రశంసల జల్లు...


ఐపీల్ 2020 కి కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌కు ఫీల్డింగ్ మెళుకువలు నేర్పుతూ తాను కూడా గాలిలో ఎగిరి క్యాచ్ పట్టిన జాంటీరోడ్స్ కు ట్విట్టర్లో నెటిజెన్ల నుండి ప్రశంసల జల్లు కురుస్తుంది. దక్షిణాఫ్రికా మాజీ లెజెండ్ జాంటీ రోడ్స్ ప్రస్తుతం ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌కు ఫీల్డింగ్ ట్రిక్స్ నేర్పిస్తున్నాడు. ఈ సమయంలో 51 ఏళ్ల అనుభవజ్ఞుడు ప్రాక్టీస్ సెషన్‌లో గాలిలో తేలి క్యాచ్‌ను పట్టుకుని చాలా మంది యువకులను షాక్‌కు గురిచేశాడు. గతంలో ఎన్నో టెస్టులు, వన్డేలను తన క్యాచ్ లతో గెలిపించిన జాంటీరోడ్స్ ప్రస్తుతం ఐపీఎల్ లో తన టీంసభ్యులకు క్యాచులు పట్టే తీరును నేర్పిస్తున్నాడు.

మ్యాచ్ జరుగుతున్న మైదానంలో పాదరసంలా కదులుతూ బంతులు తనను దాటిపోకుండా చూడటంలో జాంటీరోడ్స్ పెట్టింది పేరు. ఐపీఎల్ లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు ఫీల్డింగ్ లో మంచి జట్టుగా నిలువాలన్న తపనతో వారిని ట్రైన్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాను కూడా వారితో కలిసి ప్రాక్టీస్ చేస్తూ బంతులను క్యాచ్ పడుతున్నాడు. ఈ సందర్భంగా గాలిలో ఎగిరి జాంటీరోడ్స్ క్యాచ్ పట్టిన వీడియోను కింగ్స్ ఎలెవన్ పంజాబ్ మేనేజిమెంట్ ట్విట్టర్లో పంచుచుకున్నది. ఈ వీడియోను చూసిన నెటిజెన్లు జాంటీరోడ్స్ ఫీల్గింగ్ పై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. అతను గ్రౌండ్లో నిలబడితే ఆ ప్రక్క గోడకట్టినట్లు ఒక బంతి కూడా అతనిని దాటి వెళ్ళదు. సునాయాసంగా బంతులను అందుకోవడంలో అతను దిట్ట.

కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఈసారి ఐపీఎల్ యుఏఈలో ఈ నెల 19 నుంచి నవంబర్ 10 వరకు జరుగనున్నది. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ యొక్క మొదటి మ్యాచ్ సెప్టెంబర్ 20 న ఢిల్లీతో జరుగుతుంది. పంజాబ్ జట్టు ఇంతవరకు ఒక్కసారి కూడా టైటిల్ గెలవలేదు. 2014 లో ఒకసారి ఫైనల్ మ్యాచ్ లో జాంటీరోడ్స్ ఆడారు. 245 వన్డేల్లో 5,935 పరుగులతో క్రికెట్ ప్రపంచంలో అత్యుత్తమ ఫీల్డర్‌గా 52 టెస్టుల్లో 2532 పరుగులు మరియు 245 వన్డేల్లో 5935 పరుగులు చేశాడు. అతను 2003 ప్రపంచ కప్ తరువాత అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయ్యాడు. ఫీల్డింగ్ కు మారుపేరుగా పిలవబడే జాంటీరోడ్స్ ఈ వయసులో కూడా ఎగిరి క్యాచ్ పట్టడంతో ప్రశంసలు పొందుతున్నాడు.

Tags :
|

Advertisement