Advertisement

గ్రేటర్ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ప్రచారం...!

By: Anji Sat, 21 Nov 2020 10:12 PM

గ్రేటర్ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ప్రచారం...!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఏపీ రాష్ట్రంలో విస్తృతంగా పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. జనసేన పార్టీలో క్రియాశీలక సభ్యత్వం తీసుకున్న వారిని అభినందిస్తూ మరో పక్క నాయకులను అప్రమత్తం చేస్తూ భవిష్యత్తులో ఏ విధంగా పార్టీని ముందుకు తీసుకెళ్లాలో వంటి విషయాలపై పవన్ కళ్యాణ్ విస్తృతంగా చర్చలు జరిపారు.

ఇదే క్రమంలో గ్రేటర్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేస్తుందని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా గ్రేటర్ ఎన్నికలలో పోటీ చేయబోతున్న మిత్రపక్షం బీజేపీ అధినేత బండి సంజయ్ పొత్తుల గురించి కీలక వ్యాఖ్యలు చేశారు.

జనసేన పార్టీతో పొత్తు ఉండదని కానీ పవన్ కళ్యాణ్ ని బీజేపీ పార్టీ తరపున గ్రేటర్ పరిధిలో ప్రచారానికి ఆహ్వానిస్తున్నట్లు స్పష్టం చేశారు. ఈ క్రమంలో త్వరలోనే పవన్ కళ్యాణ్ తో సమావేశం కాబోతున్నట్లు పేర్కొన్నారు బండి సంజయ్.

దీంతో బీజేపీ జనసేన పొత్తు పెట్టుకుని ఎన్నికలలో పోటీకి దిగుతున్నట్లు వస్తున్న వార్తలకు బండి సంజయ్ కామెంట్లు క్లారిటీ ఇచ్చినట్లయింది.

Tags :

Advertisement