Advertisement

  • జెపి నడ్డాకు కరోనా పాజిటివ్ ..స్పందించిన పవన్ కళ్యాణ్

జెపి నడ్డాకు కరోనా పాజిటివ్ ..స్పందించిన పవన్ కళ్యాణ్

By: Sankar Mon, 14 Dec 2020 8:40 PM

జెపి నడ్డాకు కరోనా పాజిటివ్ ..స్పందించిన పవన్ కళ్యాణ్


బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నిన్న కరోనా బారిన పడ్డ విషయం తెలిసిందే. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్ ద్వారా తెలిపారు. అయితే జనసేన అధినేత, సినీ నటుడు పవన్‌ కళ్యాణ్‌ నడ్డా త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. నడ్డా త్వరగా కోలుకోవాలని శ్రీ వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తున్నానని పవన్‌ ట్వీట్‌ చేశారు.

కాగా తనకు ఇప్పుడు ఆరోగ్యం బాగానే ఉందని ఆయన వెల్లడించారు. “కరోనా వైరస్ లక్షణాలు కనిపించిన వెంటనే కరోనా టెస్టు చేయించుకున్నాను. ఫలితం పాటిటివ్ అని వచ్చింది. వైద్యుల సలహా మేరకు అన్నికరోనా మార్గదర్శకాలను పాటిస్తూ హోమ్ ఐసోలేషన్‌లో ఉంటున్నాను.

నా ఆరోగ్యం బాగుంది. గత కొద్ది రోజులుగా నన్ను కాంటాక్ట్ అయిన వారు, దగ్గరగా మెలిగిన వారు టెస్టులు చేయించుకోవాలని, జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్నాను” అని జేపీ నడ్డా ట్విట్టర్ ద్వారా కోరారు

Tags :

Advertisement