Advertisement

  • ఏపీ సీఎం జగన్ పై ప్రశంసలు కురిపించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్

ఏపీ సీఎం జగన్ పై ప్రశంసలు కురిపించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్

By: Sankar Fri, 03 July 2020 6:44 PM

ఏపీ సీఎం జగన్ పై ప్రశంసలు కురిపించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్



ఎప్పుడు అధికార వైస్సార్సీపీ పార్టీ మీద విరుచుకుపడే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ , ఈ రోజు సీఎం జగన్ మోహన్ రెడ్డి మీద ప్రశంసలు కురిపించారు ..ఈ మేరకు శుక్రవారం ఆయన వరుస ట్వీట్లు చేశారు..ఆపత్కాల పరిస్థితిలో అంబులెన్సు సేవలను తీసుకొచ్చినదుకు ధన్యవాదాలు తెలిపారు ..అలాగే కరోనా మీద చేస్తున్న పోరాటాన్ని కూడా మెచ్చుకున్నారు ..

ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారు, అత్యవసర సేవల్ని అందించే అంబులెన్సులిని, ప్రస్తుతం ఉన్న అత్యవసర పరిస్థితుల్లో ఆరంభించడం అభినందనీయం. అలాగే, గత మూడు నెలలుగా కరోనా టెస్టుల విషయంలో ఏ మాత్రం అలసత్వం ప్రదిర్శించకుండా ప్రభుత్వం పనిచేస్తున్న తీరు అభినందనీయం.’’ అని పవన్ ప్రశంసలు కురిపించారు.ఇది ప్రపంచానికే గడ్డు కాలం.. అందుకే ఎవరి జాగ్రత్తలు వారు తీసుకుంటూ రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలకు సహకరిద్దాం. క్షేమంగా ఉందాం’’ అంటూ ప్రజలకు జనసేని పిలుపునిచ్చారు.

అయితే కరోనా వైరస్ మీద పోరాటంలో ముఖ్యంగా చేయాల్సింది వైరస్ ను ట్రేస్ చేయడం అంటే కరోనా టెస్ట్ లు చేయడం ..ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ దేశం మొత్తంలోనే ఆదర్శప్రాయంగా ఉంది ..ఎక్కువ సంఖ్యలో కరోనా టెస్టులను చేస్తుంది ..దీనితో కరోనా ఉన్న వారిని కనుక్కోవడం సులభతరం అవుతుంది ..



Tags :
|
|
|

Advertisement