Advertisement

  • దేశంలో ఉత్తమ పదవ పోలీస్ స్టేషన్ గా జమ్మికుంట పోలీస్ స్టేషన్

దేశంలో ఉత్తమ పదవ పోలీస్ స్టేషన్ గా జమ్మికుంట పోలీస్ స్టేషన్

By: Sankar Fri, 04 Dec 2020 10:43 AM

దేశంలో ఉత్తమ పదవ పోలీస్ స్టేషన్ గా జమ్మికుంట పోలీస్ స్టేషన్


కరీంనగర్‌ పోలీసు కమిషనరేట్‌ జాతీయ స్థాయిలో మరో గుర్తింపు సంపాదించింది. దీని పరిధిలోని జమ్మికుంట పోలీసుస్టేషన్‌ పదో ఉత్తమ ఠాణాగా ఎంపికైంది.

దేశవ్యాప్తంగా ఎంపికైన పది ఉత్తమ ఠాణాల జాబితాను కేంద్ర హోంశాఖ (ఎంహెచ్‌ఏ) గురువారం విడుదల చేసింది. గతేడాది ఇదే కమిషనరేట్‌లో ఉన్న చొప్పదండి పోలీస్‌స్టేషన్‌ ఎనిమిదో స్థానం కైవసం చేసుకుంది. ఇటు జమ్మికుంట ఠాణా సిబ్బందిని డీజీపీ ఎం.మహేందర్‌రెడ్డి ప్రత్యేకంగా అభినందించారు. ఈ ఠాణాను ఇతర పోలీస్‌స్టేషన్‌లు ఆదర్శంగా తీసుకోవాలని డీజీపీ సూచించారు.

2016లో జరిగిన డీజీపీల సదస్సులో తీసుకున్న నిర్ణయం నేపథ్యంలో 2017 నుంచి ‘ఉత్తమ పోలీస్‌స్టేషన్ల’గుర్తింపు ఎంపిక ప్రక్రియ ప్రారంభమైంది. ఆ ఏడాది హైదరాబాద్‌లోని పంజగుట్ట పోలీసుస్టేషన్‌ రెండో స్థానంలో నిలి చింది. ఆ తర్వాతి ఏడాది రాచకొండ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని నారాయణ్‌పూర్‌ పోలీస్‌స్టేషన్‌ టాప్‌–10లో స్థానం సంపాదించలేకపోయినా.. 14వ స్థానంలో నిలిచింది.

Tags :
|
|

Advertisement