Advertisement

  • కరోనా మహమ్మారి తో పోరాడి ప్రాణాలు విడిచిన జగిత్యాల అడిషనల్ ఎస్పీ

కరోనా మహమ్మారి తో పోరాడి ప్రాణాలు విడిచిన జగిత్యాల అడిషనల్ ఎస్పీ

By: Sankar Wed, 26 Aug 2020 2:53 PM

కరోనా మహమ్మారి తో పోరాడి ప్రాణాలు విడిచిన జగిత్యాల అడిషనల్ ఎస్పీ


కరోనా పోరాటంలో కొంత మంది కరోనా వారియర్స్ చనిపోతున్న విషయం తెలిసిందే ..అయితే తాజాగా కరోనా వైరస్ సోకి కరీంనగర్.. జగిత్యాల అడిషనల్ ఎస్పీ మృతిచెందారు. అడిషనల్ ఎస్పీ దక్షిణ మూర్తికి ఇటీవలే కరోనా సోకింది . దీంతో ఆయన కరీంనగర్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. ఈరోజు ఉదయం ఆయన పరిస్థితి విషమించడంతో ఆస్పత్రిలోనే మరణించారు.

దక్షిణామూర్తి వారం క్రితం వరకూ విధుల్లోనే ఉన్నారు. మొన్న వర్షాలు, వరదలు వచ్చిన నేపధ్యంలో కూడా ఆయన విస్తృతంగా జిల్లాల్లో పర్యటించారు. ఈలోపు ఆయనకు కరోనా సోకడంతో హాస్పిటల్ లో చేరారు. ఇంతలోపే ఆయన ఆరోగ్యం విషమించి మరణించినట్టు తెలుస్తోంది. దక్షిణ మూర్తి ఆకస్మిక మృతితో జిల్లా పోలీస్ యంత్రాంగం తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. కరోనా వల్ల అడిషనల్ ఎస్పీ చనిపోవడంతో మిగతా పోలీస్ శాఖ అధికారుల్లో ఆందోళన నెలకొంది. ఆయన కుటుంబానికి పలువురు ఉన్నతాధికారులు ప్రగాఢ సానుభూతి వ్యక్తంచేశారు.

కాగా దక్షిణామూర్తి మృతికి పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సంతాపం ప్రకటించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..ఉమ్మడి వరంగల్ జిల్లాలో అత్యధిక కాలం విధులు నిర్వహించి అందరి మన్ననలు పొందిన వ్యక్తి దక్షిణామూర్తి అన్నారు. కరోనాతో అతడు చనిపోవడం చాలా బాధాకరమని మంత్రి ఎర్రబెల్లి విచారం వ్యక్తం చేశారు..

మేడారం జాతర స్పెషల్ ఆఫీసర్ గా మంచి అనుభవం ఉన్నపోలీస్ అధికారిగా గుర్తింపు ఉన్న విషయాన్ని గుర్తు చేశారు. వరంగల్ ప్రాంతంలో ఎక్కువ కాలం పని చేయడం ద్వారా వారితో నాకు మంచి అనుబంధం ఉండేదన్నారు. ఎస్ఐగా పోలీస్ శాఖలో చేరి సీఐ, డీఎస్పీ, ప్రస్తుతం అడిషనల్ ఎస్పీగా పదోన్నతి పొందారు అంటే వారు ఎంత బాధ్యతగా పని చేసేవారో అర్థమవుతుందన్నారు. దక్షిణామూర్తి ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

Tags :

Advertisement