Advertisement

  • పాఠశాలలు తెరవని కారణంగా ‘జగనన్న విద్యాకానుక’ అక్టోబరు 5వ తేదీకి వాయిదా

పాఠశాలలు తెరవని కారణంగా ‘జగనన్న విద్యాకానుక’ అక్టోబరు 5వ తేదీకి వాయిదా

By: chandrasekar Sat, 05 Sept 2020 09:36 AM

పాఠశాలలు తెరవని కారణంగా ‘జగనన్న విద్యాకానుక’ అక్టోబరు 5వ తేదీకి వాయిదా


దేశంలో కరోనా విలయ తాండవం తెస్తున్న కారణంగా పాఠశాలలు మూతపడిన విషయం తెలిసిందే. అన్ లాక్ సూచనలు ప్రకారం పాఠశాలలు సెప్టెంబర్ 30 కి వాయిదా పడడంతో ‘జగనన్న విద్యాకానుక’ కూడా అక్టోబరు 5వ తేదీకి వాయిదా వేశారు. ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలనుకున్న ‘జగనన్న విద్యాకానుక’ కార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు పాఠశాల విద్య సంచాలకుడు వాడ్రేవు చినవీరభద్రుడు శుక్రవారం ఓ ప్రకటనలో వెల్లడించారు. ‘జగనన్న విద్యాకానుక’ కార్యక్రమాన్ని సెప్టెంబరు 5న ప్రభుత్వం నిర్వహించాలనుకున్న విషయం విదితమే.

దేశంలో అన్నింటికీ సడలింపులు ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన కోవిడ్-19 అన్ లాక్ 4.0 మార్గ దర్శకాల ప్రకారం సెప్టెంబరు 30వ తేదీ వరకు పాఠశాలలు తెరవకూడదని నిర్ణయించడంతో ఈ కార్యక్రమాన్ని అక్టోబరు 5వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ‘జగనన్న విద్యాకానుక’ కార్యక్రమం అక్టోబర్ 5వ తేదీన ప్రారంభమవుతుందని, ఈ విషయాన్ని విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయుడు, అధికారులు గమనించాలని చినవీరభద్రుడు సూచించారు.

విద్యార్థులను ప్రోత్సహించడంలో భాగంగా ఆంధ్ర రాష్ట్ర విద్యార్థులకు స్కూల్ యూనిఫామ్స్ నుంచి నోటు పుస్తకాలు, బూట్లు వరకు ఇవ్వాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్ణయించిన విషయం తెలిసిందే. నాడు- నేడు కార్యక్రమం కింద ఇప్పటికే పాఠశాలలను తీర్చిదిద్దాలని సంకల్పించిన ముఖ్యమంత్రి జగన్ ప్రతి స్కూల్లో అన్ని వసతులు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అలాగే ప్రతి విద్యార్థికి అన్ని సదుపాయాలను కల్పించాలని నిర్ణయించారు. ఇందువల్ల పేద విద్యార్థులు కూడా పాఠశాలకు వెళ్లి చదువుకోవాలని ప్రోత్సహించబడతారు.

Tags :

Advertisement