Advertisement

  • చంద్రబాబు పథకాలపై సీబీఐ విచారణ జరపాలన్న జగన్ సర్కార్

చంద్రబాబు పథకాలపై సీబీఐ విచారణ జరపాలన్న జగన్ సర్కార్

By: chandrasekar Fri, 12 June 2020 11:37 AM

చంద్రబాబు పథకాలపై సీబీఐ విచారణ జరపాలన్న జగన్ సర్కార్


జగన్ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వ హయాంలోని అవకతవకలపై కేబినెట్ సబ్‌కమిటీ సీఎం జగన్‌కు నివేదిక అందజేయగా కేబినెట్‌లో చర్చించారు.

ఏపీ ఫైబర్ నెట్ ప్రాజెక్టులో భారీ అవకతవకలు జరిగాయని కేబినెట్ సబ్ కమిటీ నివేదిక ఇచ్చింది. అర్హత లేని సంస్థలకు కట్టబెట్టారని పేర్కొంది. సెటాప్ బాక్సుల కొనుగోళ్లలో భారీ కుంభకోణం జరిగిందని ఫైబర్ నెట్‌లో సుమారు రూ.700కోట్ల మేర అవినీతి జరిగిందని తేల్చారట.

మరోవైపు చంద్రన్న తోఫా, చంద్రన్న కానుక వంటి పథకాల ద్వారా రూ.158కోట్ల అవినీతి జరిగిందని కేబినెట్ సబ్ కమిటీ తేల్చింది. హెరిటేజ్ మజ్జిగ ప్యాకెట్ల ద్వారా ఏడాదికి రూ.40కోట్లు ఖర్చు చేశారని హెరిటేజ్ మజ్జిగ ప్యాకెట్ల సరఫరా ఖర్చులపై సీబీఐ విచారణ కోరాలని నిర్ణయం తీసుకున్నారు. బర్ నెట్, రంజాన్ తోఫా, చంద్రన్న కానుకలపై సీబీఐ విచారణ కోరాలని నిర్ణయించారు. గత ప్రభుత్వ నిర్ణయాలపై ఏపీ ప్రభుత్వం గతంలోనే కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసింది. అంశాలవారీగా గత ప్రభుత్వ నిర్ణయాలను పరిశీలించి నివేదికల్ని ప్రభుత్వానికి అందజేస్తోంది.

Tags :

Advertisement