Advertisement

  • అన్లాక్ 4 మార్గదర్శకాలు విడుదల చేసిన జగన్ సర్కార్

అన్లాక్ 4 మార్గదర్శకాలు విడుదల చేసిన జగన్ సర్కార్

By: chandrasekar Mon, 07 Sept 2020 6:23 PM

అన్లాక్ 4 మార్గదర్శకాలు విడుదల చేసిన జగన్ సర్కార్


ఏపీలో జగన్ సర్కార్ అన్‌లాక్ 4 మార్గ దర్శకాలను విడుదల చేసింది. కేంద్రం మార్గదర్శకాలకు అనుగుణంగా అన్ లాక్ 4 మార్గదర్శకాలతో ఉత్తర్వులు జారీ అయ్యాయి.

సెప్టెంబర్ 21 నుండి 9, 10, ఇంటర్ విద్యార్థులు కాలేజీలు, స్కూళ్లకు వెళ్లేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అయితే దీనికి తల్లిదండ్రుల రాత పూర్వకంగా అంగీకారం తప్పనిసరిగా ఉండాలి.

అలాగే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లకు ఈ నెల 21 నుంచి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.

పీహెచ్ డీ, పీజీ విద్యార్థులకు అనుమతి ఇచ్చారు.

సెప్టెంబర్ 21 నుంచి 100 మందికి మించకుండా సామాజిక, విద్య, స్పోర్ట్స్, మత పరమైన, పొలిటికల్ సమావేశాలకు అనుమతి ఉంటుంది.

ప్రభుత్వం సెప్టెంబర్ 21 నుండి ఓపెన్ ఎయిర్ థియేటర్స్‌కు అనుమతి ఇచ్చింది.

సినిమా హాళ్లు, స్విమ్మింగ్ పూల్స్, ఎంటర్టైన్మెంట్ పార్క్‌లకు మాత్రం అనుమతి నిరాకరించారు.

అలాగే సెప్టెంబర్ 20 నుంచి పెళ్ళిలకు 50 మంది అతిథులతో అనుమతి. ఇటు అంతక్రియలకు 20 మందికి అనుమతి ఇస్తారు.

Tags :
|
|

Advertisement