Advertisement

  • ఆంధ్రప్రదేశ్ సచివాలయ మహిళా ఉద్యోగులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్

ఆంధ్రప్రదేశ్ సచివాలయ మహిళా ఉద్యోగులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్

By: chandrasekar Sat, 29 Aug 2020 09:43 AM

ఆంధ్రప్రదేశ్ సచివాలయ మహిళా ఉద్యోగులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్


కొత్తగా ఏర్పడిన ఆంధ్ర ప్రదేశ్ సచివాలయ మహిళా ఉద్యోగులకు జగన్ సర్కార్ తీపి కబురు తెలిపింది. ఆంధ్రప్రదేశ్ సచివాలయ, అసెంబ్లీ, విభాగాధిపతుల కార్యాలయాల్లో పనిచేసే మహిళా ఉద్యోగులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పటి వరకు కల్పిస్తున్న ఉచిత వసతి సౌకర్యాన్ని మరో ఏడాది పాటు ప్రభుత్వం పొడిగించింది. హైదరాబాద్ నుంచి వచ్చి విజయవాడ, గుంటూరుల్లోని కార్యలయాల్లో పనిచేస్తున్న మహిళా సిబ్బందికి 2021 జూన్ 31వ తేదీ వరకు ఉచిత వసతి సౌకర్యాన్ని పొడిగిస్తున్నట్లు ఆదేశాలు జారీ చేసింది. 2020 ఆగస్టు 1తో మహిళా ఉద్యోగులకు ఉచిత వసతి సౌకర్యం గడువు ముగియటంతో మరో ఏడాది పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

ఈ ఉద్యోగులకుగాను రెయిన్ ట్రీపార్కులో ఉన్న త్రిబుల్ బెడ్ రూమ్ ఫ్లాట్‌ల్లో ఆరుగురు ఉద్యోగినులు, డబుల్ బెడ్ రూమ్ ఫ్లాట్‌లో నలుగురు చొప్పున ఉండాలని ప్రభుత్వం స్పష్టం సూచించింది. ప్రతి మూడు నెలలకూ పరిస్థితిని అంచనా వేసి సదరు ఫ్లాట్ల లీజు పొడిగింపుపై నిర్ణయం తీసుకోవాల్సిందిగా అధికారులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన తర్వాత హైదరాబాద్ కేంద్రంగా కొంత కాలం పరిపాలన సాగినా తర్వాత అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అమరావతి కేంద్రంగా పాలన సాగించాలని భావించి రాజధానిని తరలించారు.

చాలాకాలం బాటు హైదరాబాద్‌లో స్థిరపడ్డ ఉద్యోగులు ఒక్కసారిగా ఏపీకి వచ్చేయాల్సిన పరిస్థితి ఏర్పడంతో వారికి అప్పటి ప్రభుత్వం కొన్ని వసతులు కల్పించింది. హైదరాబాద్ నుంచి ప్రత్యేకంగా రైలు ఏర్పాటు చేసింది. అలాగే ఇక్కడే ఉండే వారికి వసతి సౌకర్యం ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగానే మరో సంవత్సరం పాటు మహిళా ఉద్యోగులకు వసతి సౌకర్యం పొడిగించింది. వీరికి కల్పించిన సదుపాయాలవల్ల సంతోషాన్ని వెలిబుచ్చినట్లు తెలుస్తుంది. ఉచిత వసతి సౌకర్యాన్ని పొడిగించడంవల్ల ఈ ఉద్యోగులకు మరింత సదుపాయాలు చేకూరుతుంది.

Tags :

Advertisement