Advertisement

రైతుల అకౌంట్లలో డబ్బు జమ చేసిన జగన్ సర్కార్...

By: chandrasekar Tue, 15 Dec 2020 9:42 PM

రైతుల అకౌంట్లలో డబ్బు జమ చేసిన జగన్ సర్కార్...


ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రైతు సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన డాక్టర్‌ వైఎస్సార్‌ ఉచిత పంటల బీమా పథకం కింద 2019 సీజన్‌లో నష్టపోయిన రైతులకు బీమా పరిహారం అకౌంట్లలో జమ చేశారు. సీఎం క్యాంప్‌ కార్యాలయంలో కంప్యూటర్‌లో రూ.1,252 కోట్ల పరిహారాన్ని మొత్తం 9.48 లక్షల రైతులకు చెల్లించారు. ఈ ప్రక్రియలో పూర్తి పారదర్శకత పాటిస్తూ, పథకంలో లబ్ధిదారులైన రైతుల జాబితాలను, పూర్తి వివరాలతో గ్రామ సచివాలయాల్లో ప్రదర్శిస్తున్నారు. రైతులకు పైసా కూడా లేకుండా బీమా ప్రీమియం పూర్తి ఖర్చును ప్రభుత్వమే భరిస్తోంది.

గతంలో పంటల బీమా గురించి కానీ, ఇన్స్యూరెన్స్ సొమ్ము వస్తుందనే నమ్మకం ఉండేది కాదు. పంటనష్టం జరిగితే బీమా వస్తుందనే నమ్మకం రైతుల్లో కలగాలి అన్నారు. రైతుల ప్రీమియం వాటి రూ.465 కోట్లు ప్రభుత్వమే కట్టిందన్నారు. గతంలో రైతులు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రీమియం కట్టేవని రైతుల తరపున రాష్ట్ర ప్రభుత్వమే ఇన్స్యూరెన్స్ ప్రీమియం కడుతోంది అన్నారు భూమి సాగు చేస్తూ, ఈ క్రాప్‌లో రైతులు నమోదు చేసుకున్న ప్రతి ఎకరాన్ని పంటల బీమా పరిధిలో చేర్చి, రైతుల తరఫున బీమా ప్రీమియాన్ని ప్రభుత్వమే చెల్లిస్తూ, వైఎస్సార్‌ ఉచిత పంటల బీమా పథకం అమలు చేస్తోంది. అలాగే ప్రకృతి వైపరీత్యాల వల్ల పంటలు నష్టపోయినప్పుడు ఆ వివరాలు అంచనా వేసి, బీమా పరిహారం అందించే విధంగా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది.

Tags :
|

Advertisement