Advertisement

  • అత్యుత్తమ సీఎంల జాబితాలో ముందు వరసలో జగన్ మరియు చివరి వరుసలో కెసిఆర్

అత్యుత్తమ సీఎంల జాబితాలో ముందు వరసలో జగన్ మరియు చివరి వరుసలో కెసిఆర్

By: chandrasekar Sat, 08 Aug 2020 7:15 PM

అత్యుత్తమ సీఎంల జాబితాలో ముందు వరసలో జగన్ మరియు చివరి వరుసలో కెసిఆర్


ఇండియా టుడే - కార్వీ ఇన్‌సైట్స్ చేపట్టిన అత్యుత్తమ సీఎంల లిస్టులో తెలుగు రాష్ట్రాల జాబితాలో ముందు వరసలో జగన్ మరియు చివరి వరుసలో కెసిఆర్ లు నిలిచాయి. మన దేశంలో అత్యుత్తమ సీఎంల జాబితాలో ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ అగ్రస్థానంలో నిలిచారు. మూడ్ ఆఫ్ ది నేషన్ పేరిట నిర్వహించిన పోల్‌లో అరవింద్ కేజ్రీవాల్ రెండో స్థానంలో ఉండగా ఏపీ సీఎం వైఎస్ జగన్ మూడో స్థానంలో నిలిచారు. అనూహ్యంగా తెలంగాణ సీఎం కేసీఆర్ ఈ జాబితాలో తొమ్మిదో స్థానంలో నిలవడం గమనార్హం. ఈ జాబితాలో అట్టడుగు నుంచి కేసీఆర్ ఆరోస్థానంలో నిలిచారు.

ఉత్తరప్రదేశ్ కు ముఖ్య మంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు 24 శాతం ఓట్లు రాగా కేజ్రీవాల్‌కు 15 శాతం, జగన్‌కు 11 శాతం చొప్పున ఓట్లు పడ్డాయి. కేసీఆర్‌కు 3 శాతం మాత్రమే ఓట్లు పడ్డాయి. 2 శాతం ఓట్లతో అశోక్ గెహ్లట్, యడియూరప్ప, భూపేష్ బెహగల్, శివరాజ్ సింగ్ చౌహాన్, విజయ్ రూపానీ కేసీఆర్ కంటే వెనుక ఉన్నారు. మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వేను ఇండియా టుడే - కార్వీ ఇన్‌సైట్స్ చేపట్టాయి. జులై 15-27 తేదీల మధ్య దేశంలోని 19 రాష్ట్రాల్లో ఉన్న 97 లోక్ సభ నియోజకవర్గాల పరిధిలో ఈ సర్వే చేపట్టారు.

జూన్ నెలలో రాష్ట్రాల ముఖ్యమంత్రుల పనితీరు గురించి సీ-ఓటర్ నిర్వహించిన సర్వేలోనూ కేసీఆర్‌కు టాప్-5లో చోటు దక్కలేదు. ఈ సర్వేలో అత్యంత ప్రజాదరణ ఉన్న సీఎంల జాబితాలో ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ తొలి స్థానంలో ఉండగా కేరళ సీఎం పినరయి విజయన్‌తో పోటీ పడుతూ వైఎస్ జగన్ నాలుగో స్థానంలో నిలిచారు.

గత సంవత్సరం 2019 ఆగష్టులో వీడీపీ అసోసియేట్స్ సంస్థ 'దేశ్ కా మూడ్' పేరిట నిర్వహించిన సర్వేలో అత్యంత ప్రజాదరణ పొందిన సీఎంల జాబితాలో ఏపీ సీఎం వైఎస్ జగన్ మూడో స్థానంలో నిలవగా కేసీఆర్ ఐదో స్థానంలో నిలిచారు. గత లోక్ సభ ఎన్నికల ముందు సీఓటర్ నిర్వహించిన సర్వేలో దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన సీఎంగా కేసీఆర్ నిలిచారు. ఈ రేటింగ్లు ముఖ్య మంత్రుల మధ్య మంచి ప్రోత్సహకాన్ని ఇస్తుందని ప్రజలు భావిస్తున్నారు.

Tags :
|
|

Advertisement