Advertisement

  • గ్రామ సచివాలయాల్లో పనిచేసేవారికి జగన్ ప్రభుత్వం షాక్

గ్రామ సచివాలయాల్లో పనిచేసేవారికి జగన్ ప్రభుత్వం షాక్

By: chandrasekar Tue, 24 Nov 2020 10:10 AM

గ్రామ సచివాలయాల్లో పనిచేసేవారికి జగన్ ప్రభుత్వం షాక్


ఆంధ్రప్రదేశ్ లో గ్రామ సచివాలయాల్లో పనిచేసేవారికి జగన్ ప్రభుత్వం షాక్ ఇచ్చింది. గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేసే ఉద్యోగులకు ఏపీలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ఇకపై గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులు వారు పనిచేసే ప్రాంతంలోనే నివాసం ఏర్పాటు చేసుకోవాలి. ఈ మేరకు ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. సర్కారు ఆదేశాలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవు. ఇందువల్ల వారు అదే ప్రాంతంలో నివాసం ఏర్పాటు చేసుకోవలసి ఉంటుంది.

వీరి సేవలు ప్రజలకు అందుబాటులో ఉండడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. గ్రామ సచివాలయాల్లో పనిచేసే వారు సదరు గ్రామ పరిధిలో, అలాగే వార్డు సచివాలయాల్లో పనిచేసే సిబ్బంది మున్సిపాలిటీ లేదా కార్పోరేషన్ పరిధిలోనే నివాసం ఉండాల్సి ఉంటుంది. దీన్ని కచ్చితంగా అమలు చేయాలంటూ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. ఈ నిబంధనలు అమలు అవుతున్నాయో లేదో తెలుసుకునేందుకు డివిజనల్‌, మండల స్ధాయి అధికారులు సదరు గ్రామ, వార్డు సచివాలయాలు సందర్శించాలి.

ఇందుకోసం ఉద్యోగులు అక్కడే నివాసం ఉంటున్నారో లేదా అనే అంశాన్ని తరచుగా పరిశీలించాలని ప్రభుత్వం తాజా ఆదేశాల్లో పేర్కొంది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పలు సంక్షేమ పథకాలు ప్రజలకు వందశాతం అందడం లేదన్న ఫిర్యాదుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. తాజా నిర్ణయంతో ఇప్పటివరకూ గ్రామ సచివాలయాల్లో పనిచేస్తూ సిటీల్లో ఉంటున్న ఉద్యోగులకు షాక్ తగలనుంది.

Tags :
|
|

Advertisement