Advertisement

  • ఆంధ్రప్రదేశ్ రైతులకు జగన్ ప్రభుత్వం శుభవార్త

ఆంధ్రప్రదేశ్ రైతులకు జగన్ ప్రభుత్వం శుభవార్త

By: chandrasekar Tue, 15 Dec 2020 10:24 AM

ఆంధ్రప్రదేశ్ రైతులకు జగన్ ప్రభుత్వం శుభవార్త


రైతుల కోసం తలపెట్టిన డాక్టర్ వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకాన్ని ఈరోజు మంగళవారం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రారంభించనున్నారు. గత సంవత్సరం 2019 లో రైతులకు కలిగిన పంట నష్టాల నుండి వారిని ఆదుకునేందుకు ప్రభుత్వం వారికి భీమా పరిహారాన్ని అందజేయనుంది.

ఆంధ్రప్రదేశ్ లో రైతులకు నష్టం వాటిల్లకుండా బీమా ప్రీమియం పూర్తి ఖర్చు ప్రభుత్వమే అందించనుంది. ఇందుకోసం రైతులు ఈ క్రాప్ లో నమోదు చేసుకున్న ప్రతి ఎకరాన్ని పంటల భీమా పరిధి లో చేర్చి రైతుల తరపున బీమా ప్రీమియం ప్రభుత్వమే చెల్లిస్తూ వైయస్సార్ ఉచిత పంటల బీమా పథకం అమలు చేయనుంది. దీనిద్వారా రైతులకు పంట నష్టం జరగకుండా బీమా పరిహారం పొందవచ్చు.

బీమా పరిహారం లో భాగంగా మంగళవారం 9.48 లక్షల రైతులకు మొత్తంగా రూ.1252 కోట్లు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అందజేయనున్నారు. ఈ డబ్బు మొత్తాన్ని నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు. దీంతో రైతులకు నేరుగా లబ్ది చేకూరనుంది.

గత సంవత్సరం 2018-19 రబీ పంటల బీమా ప్రీమియంకు సంబంధించి అప్పటి ప్రభుత్వం బకాయిపడిన రూ.122.61 కోట్లను జగన్ ప్రభుత్వం చెల్లించి ఆనాటి పంట నష్టానికి సంబంధించి బీమా కంపెనీల నుంచి రావాల్సిన క్లెయిమ్ వచ్చేలా ఇప్పుడు చేసింది. జూన్ 26న బీమా కంపెనీలు రాష్ట్రంలో 5.94లక్షల రైతులకు రూ 596.36 కోట్లు విడుదల చేశాయి. ఈ డబ్బులు తన క్యాంప్ కార్యాలయంలో రైతుల ఖాతాల్లో నేరుగా జమ చేశారు. రెండో విడత భీమా డబ్బును రైతు ఖాతాలో జమ చేయనున్నారు. దీనిద్వారా పంటల వల్ల ఏర్పడ్డ నష్టాన్ని ప్రీమియం ద్వారా రైతులు పొందనున్నారు.

Tags :
|

Advertisement