Advertisement

  • డీఎస్సీ- 2018లో ఉత్తీర్ణులైన ఎస్‌జీటీ అభ్యర్థులకు జగన్ ప్రభుత్వం తీపి కబురు

డీఎస్సీ- 2018లో ఉత్తీర్ణులైన ఎస్‌జీటీ అభ్యర్థులకు జగన్ ప్రభుత్వం తీపి కబురు

By: chandrasekar Wed, 23 Sept 2020 12:32 PM

డీఎస్సీ- 2018లో ఉత్తీర్ణులైన ఎస్‌జీటీ అభ్యర్థులకు జగన్ ప్రభుత్వం తీపి కబురు


పెండింగ్‌లో ఉన్న కేసును కొట్టివేస్తూ కోర్టు తీర్పు వెలువడటంతో ఎస్జీటీ కేటగిరీలో 3524 పోస్టులకు నియామక ప్రక్రియ ప్రారంభించినట్లు ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ పేర్కొన్నారు. 2203 అభ్యర్థుల వెరిఫికేషన్ పూర్తయ్యిందని మిగిలిన 1321 మంది రికార్డుల వెరిఫికేషన్‌ నేటితో పూర్తవుతుందని ఆయన తెలిపారు.

బుధవారంలోగా ఎస్‌ఎంఎస్‌లతో అభ్యర్థులకు సమాచారం అందిస్తామని, ఈనెల 24న సర్టిఫికేట్ వెరిఫికేషన్, 25, 26 తేదీల్లో మిగిలిన ప్రక్రియ పూర్తి చేసి, 26న అపాయింట్‌మెంట్‌ఆర్డర్లు ఇస్తామని తెలిపారు. సీఎం జగన్ ఆదేశాల మేరకు త్వరితగతిన నియామక ప్రక్రియ పూర్తి చేస్తామని మంత్రి సురేష్ తెలిపారు. వీరితో పాటు స్కూలు అసిస్టెంట్లు ఖాళీలకు భర్తీ ప్రక్రియ కూడా పూర్తి చేస్తామని స్పష్టం చేశారు.

త్వరలోనే డీఎస్సీ-2020 నోటిఫికేషన్ విడుదల చేస్తామని తెలిపారు. ఉపాధ్యాయుల బదిలీలపై కూడా త్వరలో నిర్ణయం తీసుకోనున్నట్లు పేర్కొన్నారు. జాతీయ విద్యా విధానంలో ఏపీ ఇప్పటికే ముందుందని, 5+3+3+4 విధానంలో విద్య అమలు చేయనున్న మొదటి రాష్ట్రం ఏపీనే అని మంత్రి అన్నారు. ఇక జగన్మోహన్ రెడ్డి గారి విద్యా దీవెన కిట్లు ఇప్పటికే స్కూళ్లకు చేరిందని ఆయన అన్నారు.

Tags :
|

Advertisement