Advertisement

  • ఐపీఎల్‌లో దేశీయ కోచ్‌లకు అలాంటి అవకాశాలు లభిస్తే మంచిది; మహమ్మద్‌ అజారుద్దీన్

ఐపీఎల్‌లో దేశీయ కోచ్‌లకు అలాంటి అవకాశాలు లభిస్తే మంచిది; మహమ్మద్‌ అజారుద్దీన్

By: chandrasekar Fri, 24 July 2020 08:50 AM

ఐపీఎల్‌లో దేశీయ కోచ్‌లకు అలాంటి అవకాశాలు లభిస్తే మంచిది; మహమ్మద్‌ అజారుద్దీన్


దేశీయ కోచ్‌లకు ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ లో మరిన్ని అవకాశాలు ఇవ్వాలని భారత మాజీ కెప్టెన్‌, హైదరాబాద్‌ క్రికెట్‌ సంఘం (హెచ్‌సీఏ) మహమ్మద్‌ అజారుద్దీన్‌ పేర్కొన్నాడు.

గురువారం అజారుద్దీన్‌ మాట్లాడుతూ ‘అంతర్జాతీయ క్రికెట్‌లో అపార అనుభవం ఉన్న టీమ్‌ఇండియా మాజీ ఆటగాళ్లు మన దేశంలో చాలామంది ఉన్నారు.

భారత కోచ్‌లు విదేశీ లీగ్‌ల్లో విధులు నిర్వర్తించడం లేదని, అలాంటప్పుడు మన వద్దే అవకాశాలు లభిస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డాడు.

ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌, బిగ్‌బాష్‌ లీగ్‌లో జట్లకు భారత కోచ్‌లుగా వ్యవహరించడం లేదు. అర్హత ఉన్నవారికి మన వద్దే అవకాశాలు లభిస్తే బాగుంటుంది’ అని అన్నాడు.

దేశీయ కోచ్‌లకు అలాంటి అవకాశాలు లభిస్తే మంచిదని అభిప్రాయపడ్డాడు. ఈ విషయాన్ని బీసీసీఐ వార్షిక సమావేశంలోనూ ప్రస్తావించినట్లు అజార్‌ పేర్కొన్నాడు.

మాజీ ఆటగాళ్లకు బోర్డు సహాయ సహకారాలు అందిస్తున్నప్పటికీ ఐపీఎల్‌ వల్ల విదేశీ కోచ్‌లు కోట్లు మూటగట్టుకుంటున్నారని అజారుద్దీన్‌ చెప్పాడు.

Tags :

Advertisement