Advertisement

  • ఆ ఇద్దరిలో ఒకరిని ఎంపిక చేయడం కష్టమే ..హనుమ విహారి

ఆ ఇద్దరిలో ఒకరిని ఎంపిక చేయడం కష్టమే ..హనుమ విహారి

By: Sankar Mon, 14 Dec 2020 10:19 AM

ఆ ఇద్దరిలో ఒకరిని ఎంపిక చేయడం కష్టమే ..హనుమ విహారి


గత ఏడాది క్రితం టీంఇండియాలో వికెట్ కీపర్ అంటే అందరు రిషబ్ పంత్ వైపు చూసారు...అయితే ఫామ్ కోల్పోయిన పంత్ జట్టులో స్థానం కోల్పోయే దశకు వచ్చాడు ..ఇదే సమయంలో సాహా కూడా రాణిస్తుండటంతో ఇద్దరి మధ్య తీవ్ర పోటీ నెలకొన్నది..

ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా ఆడాల్సిన నాలుగు టెస్ట్ మ్యాచ్ లలో మొదటి డే-నైట్ మ్యాచ్ ఈ నెల 17 న అడిలైడ్ వేదికగా ప్రారంభం కానుంది. అయితే ఈ మ్యాచ్ లో వికెట్ కీపర్ ని ఎంపిక చేయడం పెద్ద తలనొప్పే అని భారత టెస్ట్ బ్యాట్సమెన్ హనుమ విహారి తెలిపాడు. తాజాగా ఈ రేడు జట్ల మధ్య జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్ లో అదరగొట్టిన విహారి అనంతరం మాట్లాడుతూ... ప్రస్తుతం జట్టులో ఉన్న పంత్, సాహా ఇద్దరు మంచి ఫామ్ లో ఉన్నారు.

వారి మధ్య గట్టి పోటీ ఉంది. అయితే ఇటువంటి పోటీలు ఉండటం జట్టుకు మంచిదే. కానీ వీరిద్దరిలో ఎవరిని తుది జట్టులోకి తీసుకోవాలి అనే నిర్ణయం పెద్ద తపాలనొప్పి అని తెలిపాడు. అయితే ఆసిస్ తో జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్ లో సాహా అర్ధశతకం బాదగా పంత్ సెంచరీ పూర్తి చేసాడు. మరి వీరిలో వికెట్ కీపర్ గా ఎవరు మొదటి మ్యాచ్ ఆడుతారు అనేది చూడాలి.

Tags :
|
|

Advertisement