Advertisement

  • లాక్ డౌన్ తో యువకుల జీవితాలు ఎలమారాయి అనడానికి ఇది ఒక నిదర్శనం...

లాక్ డౌన్ తో యువకుల జీవితాలు ఎలమారాయి అనడానికి ఇది ఒక నిదర్శనం...

By: chandrasekar Wed, 25 Nov 2020 6:22 PM

లాక్ డౌన్ తో యువకుల జీవితాలు ఎలమారాయి అనడానికి ఇది ఒక నిదర్శనం...


మహబూబ్ నగర్ జిల్లా మూసాపేట్ జాతీయ రహదారిపై ఓ యువకుడు వీరంగం సృష్టించాడు. వాహనాల అద్దాలు ధ్వంసం చేశాడు. పోలీసులపై రాళ్లు విసిరాడు. తనను పట్టుకోవద్దంటూ.. అక్కడ రాద్ధాంతం చేసాడు. అతడిని పట్టుకోబోగా చేసిన ఎదురుదాడి లో స్థానిక పోలీస్ స్టేషన్ లో పని చేస్తున్న ఒక హోంగార్డుకు గాయాలయ్యాయి.

ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలలోకి వెళితే...స్థానిక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బెంగళూరుకి చెందిన యువకుడు సునీల్ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేసేవాడు. లాక్ డౌన్ నేపథ్యంలో ఉద్యోగం కోల్పోయిన సునీల్ ఉద్యోగ రీత్యా ఇంటర్వ్యూ కోసం బెంగళూరు నుంచి హైదరాబాద్ కు ద్విచక్ర వాహనం పై వెళ్తూ అర్ధరాత్రి ఈ సమయంలో మూసాపేట్ కొద్దిదూరంలో జాతీయ రహదారికి ఆనుకొని ఉన్న ఓ ఇంటి ముందు వాహనం ఆపి దాని ఆవరణలో పడుకున్నాడు. ఉదయం ఇంట్లోని వారు గమనించి ఎవరు నువ్వు...? అంటూ అడగగా సరైన సమాధానం చెప్పకుండా వాహనం అక్కడే వదిలేసి వెళ్ళాడు. వాళ్లు పట్టుకునే ప్రయత్నం చేయడంతో పారిపోయి జాతీయ రహదారి పక్కనే నిలబడ్డాడు.

సదరు ఇంటివాళ్లు స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా పోలీసులు అతడిని పట్టుకునే ప్రయత్నం చేశారు. దీంతో అతడు ఉన్మాదిలా ప్రవర్తిస్తూ జాతీయ రహదారిపై వస్తున్న వాహనాల పై రాళ్లు విసిరాడు. పోలీస్ సిబ్బంది పై రాళ్లు విసురుతూ వీరంగం సృష్టించాడు. దీంతో హోంగార్డుకు గాయాలయ్యాయి. ఎట్టకేలకు అతనిని పట్టుకొని తాళ్లతో కట్టేసిన పోలీసులు.. స్టేషన్ ఆవరణలో అదుపులోకి తీసుకున్నారు. అతడిని విచారించగా ఉద్యోగరీత్యా హైదరాబాద్ ఇంటర్వ్యూ వెళ్తున్నా అని చెప్పాడు. జేబులో చెక్ చేయగా మత్తు పదార్థాలు ఉన్నాయి. లాక్ డౌన్ నేపథ్యంలో ఉద్యోగం కోల్పోయిన అతడు.. మత్తు పదార్థాలకు బానిసగా మారి మతిస్థిమితం కోల్పోయాడంటూ పోలీసులు చెప్పారు.

Tags :
|

Advertisement