Advertisement

  • పబ్ జి కి ఇంకా ఇండియాలో అనుమతులు ఇవ్వలేదు ..ఐటి శాఖ

పబ్ జి కి ఇంకా ఇండియాలో అనుమతులు ఇవ్వలేదు ..ఐటి శాఖ

By: Sankar Sun, 20 Dec 2020 3:55 PM

పబ్ జి కి ఇంకా ఇండియాలో అనుమతులు ఇవ్వలేదు ..ఐటి శాఖ


గత కొంతకాలం క్రితంవరకూ దాదాపు అందరు యువత ఫోన్ లలో పబ్ జి గేమ్ ఉన్నది ..యువత అంతలా పబ్ జి గేమ్ కు అలవాటు పడ్డారు..అయితే చైనాతో సరిహద్దులో తలెత్తిన సమస్యలతో భద్రత కారాణాల దృష్ట్యా పబ్ జి యాప్ తోపాటు మరికొన్ని చైనీస్ యాప్ లను బ్యాన్ చేసారు...

అయితే ఈ గేమ్ నిర్వాహకులు చైనాకు చెందిన టెన్సెంట్ గేమ్స్‌తో ఒప్పందాన్ని రద్దు చేసుకొని ప‌బ్‌జి కార్పొరేషన్ సొంత సంస్థ‌గా భార‌త్‌లో రిజిస్ట‌ర్ చేసుకుంది. దీనిలో భాగంగా "పబ్జి మొబైల్ ఇండియా" పేరుతొ తిరిగి మార్కెట్లోకి రావాలని భావిస్తుంది.

అయితే గేమ్‌ను మ‌ళ్లీ భార‌త్‌లో లాంచ్ చేసేందుకు ఇంకా ప‌బ్‌జి కార్పొరేషన్ కి కేంద్రం నుండి అనుమ‌తులు లభించడంలేదు. పబ్జి ప్రీయులకు ఇది చేదువార్తే.ఇదే విషయంపై ఇటీవల ఒకరు పబ్జి గేమ్ విడుదలపై ఆర్టీఐ ద్వారా సంబంధిత శాఖను సమాచారం కోరారు. ఈ ప్రశ్నకు ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ప్రతిస్పందిస్తూ.. ''పబ్జి ప్రారంభించడానికి ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఎటువంటి అనుమతి ఇవ్వలేదు" అని ప్రకటించింది

Tags :
|

Advertisement