Advertisement

  • కరోనా కాలంలో ఇంత మొత్తంలో చైనా ఎగుమతులు పెరగడం ఆశ్చర్యమే

కరోనా కాలంలో ఇంత మొత్తంలో చైనా ఎగుమతులు పెరగడం ఆశ్చర్యమే

By: chandrasekar Fri, 11 Sept 2020 09:26 AM

కరోనా కాలంలో ఇంత మొత్తంలో చైనా ఎగుమతులు పెరగడం ఆశ్చర్యమే


చైనా ఎగుమతులు ఆగస్టులో.. గతేడాదితో పోలిస్తే పెరుగుదల 9.5శాతం ఎక్కువగా ఉన్నట్టు కస్టమ్స్ డేటా గణాంకాలు చెబుతున్నాయి. దిగుమతులు 2.1శాతం తగ్గినప్పటికీ కరోనా కాలంలో ఇంత మొత్తంలో ఎగుమతులు పెరగడం ఆశ్చర్యమే. జూలైలో ఆ దేశ ఎగుమతులు 7.2శాతం పెరిగాయి. దీంతో ఆగస్టులో అవి మరింత పెరగనున్నట్టు అంచనా వేశారు. వరుసగా మూడు నెలలు ఎగుమతుల్లో పెరుగుదల కనిపించింది. కరోనా కారణంగా ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలు అతలాకుతలమవుతుంటే చైనాలో మాత్రం ఇందుకు భిన్నమైన వాతావరణం ఉంది. జూలైలో చైనా ఎగుమతులు దిగుమతులను మించి పోయినందున ట్రేడ్ సర్‌ప్లస్ 62.33 బిలియన్ అమెరికన్ డాలర్లకు చేరుకుంది. ఇది ఆగస్టులో 58.93 బిలియన్ అమెరికన్ డాలర్లుగా నమోదైంది. ఫార్మా, మెడికల్, టెక్స్‌టైల్, ఎలక్ట్రానిక్ విభాగంలో ప్రపంచ అవసరాలను తీర్చే స్థాయికి చైనా మళ్లీ చేరుకుంది.

కరోనా విజృంభణ తరువాత ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా డిమాండ్ ఉన్న అన్ని ఉత్పత్తులనూ ఆ దేశం తయారు చేస్తోంది. మాస్క్ ల నుంచి ల్యాప్‌టాప్‌ల వరకు అన్నీ ఈ జాబితాలో ఉన్నాయి. దిగుమతులు తగ్గిపోయాయంటే డొమెస్టిక్ డిమాండ్ బలహీనంగా ఉందని తెలుస్తోంది. ఇది కూడా ఎగుమతులు పెరగానికి కారణమని కొంతమంది ఆర్థికవేత్తలు చెబుతున్నారు. ఈ ఏడాది జనవరి నుంచి మార్చి మధ్యలో చూస్తే ప్రపంచ ఎగుమతుల్లో చైనా వాటా 11శాతానికి పడిపోయింది. ప్రస్తుతం అక్కడ ఆంక్షలు తొలగించడంతో సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. ఒకవేళ మళ్లీ వైరస్ విజృంభిస్తే ప్రపంచ దేశాలు మళ్లీ ఆర్థిక కార్యకలాపాలపై పరిమితులు విధించే అవకాశం ఉంది.

ప్రపంచ దేశాల్లో పూర్తి స్థాయిలో ఆర్థిక కార్యకలాపాలు మొదలయ్యేంత వరకు చైనాకు ఎగుమతులు పెరుగుతూనే ఉంటాయి. చైనాలో చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు లోన్లు ఇవ్వడం, తీసుకున్న అప్పుల చెల్లింపుల్లో మినహాయింపులు, ట్యాక్స్ రిబేట్స్ వంటివి తయారీ రంగానికి ఊతమిస్తున్నాయి. తక్కువ వేతనాలకు దొరికే కూలీలతో కార్యకలాపాలు సాగించే చైనా చిన్న, మధ్యతరహా కంపెనీలు ఆ దేశ ఆర్థిక రంగానికి ఊతమిస్తూ ఎగుమతులు పెరిగేందుకు తోడ్పడుతున్నాయి. ఎగుమతుల విలువ పెరిగినా ఆగస్టులో ఆ దేశ ఫారెన్ ఎక్చేంజ్ రిజర్వ్స్ మాత్రం పెరగలేదు. ఇందుకు కారణం యూఎస్ డాలర్ విలువ స్థిరంగా ఉండటమే.

Tags :

Advertisement