Advertisement

  • కరోనా టెస్టుల సంఖ్య పెంచుటకు ప్రైవేటు ల్యాబులపై ఆధారపడక తప్పదు

కరోనా టెస్టుల సంఖ్య పెంచుటకు ప్రైవేటు ల్యాబులపై ఆధారపడక తప్పదు

By: chandrasekar Wed, 17 June 2020 3:32 PM

కరోనా టెస్టుల సంఖ్య పెంచుటకు ప్రైవేటు ల్యాబులపై ఆధారపడక తప్పదు


ఇప్పటి వరకు కరోనా టెస్టులు తక్కువగా చేస్తూ వచ్చిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. టెస్టింగ్ కెపాసిటీని పెంచుకోవడంపై కూడా పెద్దగా ఫోకస్ పెట్టలేదు. ఇప్పుడు టెస్టుల సంఖ్యను పెంచాలని నిర్ణ‌యించినా రోజుకు 2 వేల కంటే ఎక్కువ శాంపిల్స్‌‌ పరీక్షించలేని పరిస్థితి నెలకొంది. రానున్న పదిరోజుల్లోనే 50 వేల మందికి టెస్టులు చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణ‌యించిన సంగతి తెలిసిందే. అంటే రోజుకు కనీసం 5 వేల టెస్టులు చేయాల్సి ఉంటుంది.

మన ప్రభుత్వ ల్యాబుల్లో రోజుకు ఎక్కువలో ఎక్కువగా 2 వేలకు మించి టెస్టులు చేసే చాన్స్ లేదు. దీంతో సీఎం చెప్పినట్టు పది రోజుల్లో 50 వేల టెస్టులు చేయాలంటే ప్రైవేటు ల్యాబులపై ఆధారపడక తప్పదని వైద్యారోగ్యశాఖ ఆఫీసర్లు చెబుతున్నారు. ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ ల్యాబుల్లోనే 50వేల టెస్టులు చేయాలంటే 20 రోజులకుపైగా టైమ్ ప‌డుతుందంటున్నారు.

కరోనా టెస్టులు చేసే ల్యాబ్లకు ఇండియన్ కౌన్సిల్ ఫర్మెడికల్ రీసెర్చ్(ఐసీఎంఆర్) పర్మిషన్ తప్పనిసరిగా ఉండాలి. ఇప్పటి వరకూ దేశంలోని 901ల్యాబ్ లకు ఐసీఎంఆర్ పర్మిషన్ ఇచ్చింది. ఇందులో 653 ప్రభుత్వ, 248 ప్రైవేటు ల్యాబ్లు ఉన్నాయి. దీంట్లో మన రాష్ట్రంలో 10 ప్రభుత్వ ల్యాబ్లకు మాత్రమే కరోనా టెస్టులకు చేయడానికి పర్మిషన్ ఉంది. వీటి టెస్టింగ్ కెపాసిటీ రోజుకు 2వేలుమాత్రమే ఉండగా నిజామాబాద్, గద్వాల్, కరీంనగర్‌లో ఒక్కో ల్యాబ్ను ఆఫీసర్లు రెడీ చేశారు. వీటికి పర్మిషన్ కోసం ఇటీవలే ఐసీఎంఆర్‌‌‌‌కు దరఖాస్తు చేశారు. ఈ మూడింటిలో కలిపి రోజుకు 450 వరకూ టెస్టులు చేయొచ్చు.

నిమ్స్‌‌లో పెద్దల్యాబ్‌‌ సెట్ చేయడానికి ఆఫీసర్లు ఏర్పాట్లు చేస్తున్నారు. ‘కోబాస్ ‌8800’అనే ఓమెషిన్ తెప్పిస్తున్నారు. ఈ మిషన్‌‌తో రోజుకు కనీసం 3 వేల టెస్టులు చేయొచ్చట. మంత్రి కేటీఆర్‌‌‌‌ కోరిక మేరకు ఓ కార్పొరేట్ సంస్థ సీఎస్ఆర్ కింద దీన్ని అందిస్తోంది. అయితే ఈ మెషిన్ రావడానికి, టెస్టులు మొదలు పెట్టడానికి ఇంకొన్ని రోజులు పడుతుందంటున్నారు.

18 ప్రైవేటు ల్యాబుల్లో టెస్టు లకు ఐసీఎంఆర్ ఓకే చేసింది. చాలా ప్రైవేటు సంస్థలు కరోనా టెస్టులు చేయడానికి ఐసీఎంఆర్‌‌‌‌కు దరఖాస్తు చేసుకున్నాయి. ఇందులో 18 ల్యాబ్లకు ఐసీఎంఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇవన్నీ గ్రేటర్ పరిధిలోనే ఉన్నాయి. వీటి టెస్టింగ్ కెపాసిటీ కూడా రోజుకు 2,500వరకూ ఉండొచ్చంటున్నారు. వీటిల్లోఇప్పటికే కొన్ని అనధికారికంగా టెస్టులు ప్రారంభించాయి. సర్కార్ అనుమతితో ఒకట్రెండు రోజుల్లోఅన్ని ల్యాబుల్లో టెస్టులు చేయనున్నారు. అయితే, ఎవరికి పడితే వారికి టెస్టులు చేయడానికి వీల్లేదని, వైరస్ లక్షణాలు ఉన్నవారికి మాత్రమే టెస్టులు చేయాలని సూచించింది.

Tags :

Advertisement