Advertisement

  • కారు కొనుగోలుకు వ్యవధితో కారు లోన్‌ తీసుకుంటే మంచిది...

కారు కొనుగోలుకు వ్యవధితో కారు లోన్‌ తీసుకుంటే మంచిది...

By: chandrasekar Mon, 12 Oct 2020 3:12 PM

కారు కొనుగోలుకు వ్యవధితో కారు లోన్‌ తీసుకుంటే మంచిది...


ప్రస్తుతం వివిధ బ్యాంకులు 6.85 నుంచి 11.20 శాతం మేరకు వడ్డీతో కారు లోన్లను ఆఫర్‌ చేస్తున్నాయి. సాధారణంగా కారు లోన్లు మూడు నుంచి ఐదేండ్ల కాలపరిమితితో లభిస్తాయి. కొన్ని బ్యాంకులు ఏడేండ్ల వరకు కాలపరిమితితో ఈ రుణాలను అందజేస్తున్నాయి.

అధిక కాలపరిమితితో రుణం తీసుకుంటే మీరు చెల్లించే నెలవారీ ఈఎంఐ తగ్గుతుంది. కానీ మొత్తం మీద ఎక్కువ వడ్డీ చెల్లించాల్సి వస్తుంది. షోరూమ్‌ నుంచి రోడ్డుపైకి వచ్చిన తర్వాత ఏ వాహనం విలువైనా రోజురోజుకూ క్షీణిస్తుంది. కనుక ఎక్కువ కాలపరిమితితో పెద్ద రుణాన్ని తీసుకోవడం మంచిది కాదు. స్వల్పకాల వ్యవధితో కారు లోన్‌ తీసుకుంటే ఈఎంఐ భారీగా పెరుగుతుంది.

ఈ ఈఎంఐ లను చెల్లించడంలో విఫలమైతే మీ రుణ చరిత్రపై మచ్చ పడుతుంది. వాహన రుణాలకు షరతులు కూడా వర్తిస్తాయి. కొన్ని సంస్థలు కారు ఎక్స్‌-షోరూమ్‌ ధరకు పూర్తిగా సమానమైన రుణాన్ని అందజేస్తుండగా మరికొన్ని సంస్థలు వాహన ధరలో 80 శాతం రుణాన్ని ఆఫర్‌ చేస్తున్నాయి. వాహన రుణాలను తీసుకునే ముందు వాటి వడ్డీ రేట్లు, ప్రాసెసింగ్‌ ఫీజు, ఇతర చార్జీలను ముందుగానే పరిశీలించుకోవడం మంచిది.

Tags :
|

Advertisement