Advertisement

  • ఐటీ దిగ్గజమైన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ అరుదైన ఘనత...ఉద్యోగులకు తీపి కబురు

ఐటీ దిగ్గజమైన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ అరుదైన ఘనత...ఉద్యోగులకు తీపి కబురు

By: chandrasekar Sat, 10 Oct 2020 12:39 PM

ఐటీ దిగ్గజమైన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ అరుదైన ఘనత...ఉద్యోగులకు తీపి కబురు


ఇండియన్ ఐటీ కంపెనీల్లో చెప్పుకోదగ్గ సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్. ఈ కంపెనీ ఇవాళ మార్కెట్లో అరుదైన ఘనతను సాధించింది. బిజినెస్ పరంగా చూస్తే యాక్సెంచర్ అధిగమించి కొద్దిసేపు ప్రపంచంలోనే అత్యంత విలువైన ఐటీ కంపెనీగా నిలిచింది.

అక్టోబర్ 8 క్లోజింగ్ గణాంకాల ప్రకారం టీసీఎస్‌ మార్కెట్‌ క్యాపిటలైజేషన్ 144.7 బిలియన్‌ డాలర్లు కాగా, యాక్సెంచర్‌ మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ మాత్రం 143.1 బిలియన్‌ డాలర్లకు తగ్గింది. యాక్సెంచర్ దాటిన వెంటనే కొద్దిసేపు ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీగా మారిపోయింది.

ఈ వారం ప్రారంభంలో ఇక టీసీఎస్‌ మరో కీలక మైలురాయిని చేరుకుంది. రిలయన్స్‌ ఇండస్ట్రీస్ ‌ తరువాత 10 లక్షల కోట్ల మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ సాధించిన రెండవ భారతీయ కంపెనీగా టీసీఎస్‌ నిలిచింది. కంపెనీ షేర్‌ ధర పెరగడంతో టీసీఎస్‌ మార్కెట్‌ విలువ ఏకంగా 69 వేల 82.25 కోట్లు ఎగిసి ట్రేడ్‌ ముగిసే సమయానికి బీఎస్‌ఈలో కంపెనీ మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ 10 లక్షల15 వేల 714 కోట్లకు ఎగబాకింది.

కాగా దేశంలో 10 లక్షల కోట్ల మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ను అధిగమించిన తొలి భారతీయ కంపెనీగా రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ గతంలో నిలిచిన సంగతి తెలిసిందే. రెండో స్థానాన్ని ఇప్పుడు టీసీఎస్ దక్కించుకుంది. ఇక ఇదే వారంలో బుధవారం నాడు టీసీఎస్ 16 వేల కోట్ల షేర్ల బైబ్యాక్‌ ప్రణాళికను ప్రకటించింది.

కరోనా నేపధ్యంలోనూ, అంతకుముందు సైతం పలు కంపెనీలు లేఆఫ్‌లు, వేతన కోతలు విధించడంతో పాటు ఏడాది పాటు ప్రమోషన్లు, జీతాలపెంపును నిలిపివేసిన నేపథ్యంలో టీసీఎస్‌ మాత్రం తమ ఉద్యోగులందరికీ వేతనాలను పెంచనుంది. టీసీఎస్‌ వేతన పెంపు నిర్ణయం ఐటీ రంగానికి గుడ్ న్యూస్ గా మారింది.

Tags :

Advertisement