Advertisement

  • ఐటీ ఉద్యోగులు వర్క్‌ ఫ్రం హోం వల్ల శారీరక బరువుతో బాధపడుతున్న ఉద్యోగులు...

ఐటీ ఉద్యోగులు వర్క్‌ ఫ్రం హోం వల్ల శారీరక బరువుతో బాధపడుతున్న ఉద్యోగులు...

By: chandrasekar Thu, 10 Dec 2020 11:45 PM

ఐటీ ఉద్యోగులు వర్క్‌ ఫ్రం హోం వల్ల శారీరక బరువుతో బాధపడుతున్న ఉద్యోగులు...


హెల్దీఫైమీ యాప్ ఢిల్లీ, ముంబయి, బెంగళూరు, చెన్నై, కోల్‌కత్తాతోపాటు భాగ్యనగరంలో కూడా సర్వే చేసింది. సుమారు 20కి పైగా కంపెనీలలో పనిచేస్తున్న 60వేల ఉద్యోగుల జీవన స్థితిగతులపై అధ్యయనం సాగించింది. దాదాపు 63 శాతం మంది అధిక బరువుతో బాధపడుతున్నట్లు తేల్చింది. కరోనా ప్రభావంతో ఐటీ ఉద్యోగులు, ఇతర నిపుణులు ఇండ్ల వద్ద నుంచే పనిచేస్తుండడంతో అధిక బరువు బారిన పడుతున్నారు. శారీరక వ్యాయామం చేస్తే ఎలాంటి ముప్పునైనా ఎదుర్కోవచ్చని ఫిట్‌నెస్‌ నిపుణులు చెబుతున్నారు. ఇటీవల హార్ట్‌ఎటాక్‌తో చనిపోయిన వారిలో ఎక్కువగా అధికబరువు వారే కావడం బాధాకరం. మనం తినే తిండే మనల్ని ఎలా ఉండాలో నిర్దేశిస్తుంది. అందుకే తినుబండారాల విషయంలో కూడా జాగ్రత్త అవసరం. శుభ్రత లేని దుకాణాల్లో తినకపోవడం మంచిదని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు.

ఐటీ ఉద్యోగులు వర్క్‌ ఫ్రం హోంలోనే కొనసాగుతున్నారు. గంటల తరబడి కదలకుండా పనిచేయడం వల్ల బరువు పెరుగుతున్నారు. వేళకు తినకపోతే బరువు పెరిగే అవకాశం ఉందని, కంప్యూటర్లపై ఎక్కువగా పనిచేసే వారు గంటకు రెండు నుంచి మూడుసార్లు కుర్చీలోంచి లేచి నడవడం మంచిదని సూచిస్తున్నారు. పలు అధ్యయనాలు సైతం అధిక బరువుతో బాధపడుతున్న వారి సంఖ్య పెరిగిపోతుందని వెల్లడించాయి. ఉదయాన్నే రన్నింగ్‌ చేయాలని, పోషకాహారం తీసుకోవాలని అంటున్నారు. కొవ్వు పదార్థాలు ఎక్కువగా తీసుకోవద్దని, సమయానికి నిద్ర కూడా చాలా అవసరమంటున్నారు. కసరత్తు చేసే సమయం, ఓపిక లేనివాళ్లు కనీసం సైక్లింగ్‌ చేయాలని సూచిస్తున్నారు. శరీరంలోని అన్ని భాగాలకు రక్త ప్రసరణ సజావుగా సాగేలా సైక్లింగ్‌ తోడ్పడుతుందని, స్విమ్మింగ్‌, యోగా తదితర వాటితో అధిక బరువు రాకుండా చూడొచ్చంటున్నారు. జీవనశైలిలో మార్పులు రాకపోతే అధిక బరువుతోపాటు ఇతర వ్యాధుల బారినపడే ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు. అధిక బరువు వల్ల వ్యాధుల బారిన పడే అవకాశం ఉంది. ముఖ్యంగా హార్ట్‌ఎటాక్‌, ఊపిరితిత్తుల సమస్యలు త్వరగా వచ్చే ప్రమాదం ఉందని వైద్యులు చెబుతున్నారు.

Tags :
|

Advertisement