Advertisement

  • డిసెంబ‌ర్‌లోగా ఎస్ఎస్ఎల్‌వీ రాకెట్‌ను ప్ర‌యోగించాల‌ని చూస్తున్న ఇస్రో !

డిసెంబ‌ర్‌లోగా ఎస్ఎస్ఎల్‌వీ రాకెట్‌ను ప్ర‌యోగించాల‌ని చూస్తున్న ఇస్రో !

By: chandrasekar Wed, 07 Oct 2020 5:01 PM

డిసెంబ‌ర్‌లోగా  ఎస్ఎస్ఎల్‌వీ  రాకెట్‌ను ప్ర‌యోగించాల‌ని చూస్తున్న ఇస్రో !


ఇస్రో ఈ ఏడాది డిసెంబ‌ర్‌లోగా ఎస్ఎస్ఎల్‌వీ రాకెట్‌ను ప్ర‌యోగించాల‌ని చూస్తున్న‌ది. ఇస్రోకు చెందిన ఓ సీనియ‌ర్ అధికారి ఈ విష‌యాన్ని పేర్కొన్నారు. ఆ రాకెట్‌కు చెందిన అతిపెద్ద మోటార్ బూస్ట‌ర్‌ను ప‌రీక్షిస్తున్న‌ట్లు ఆయ‌న తెలిపారు.

న‌వంబ‌ర్‌లో ఆ బూస్ట‌ర్ ప‌రీక్ష జ‌ర‌గ‌నున్న‌ట్లు తెలిపారు. శ్రీహ‌రికోట‌లోని తొలి లాంచ్ ప్యాడ్ నుంచి ఎస్ఎస్ఎల్‌వీ రాకెట్‌ను ప్ర‌యోగిస్తారు. పీఎస్ఎల్వీ సీ49 ప్ర‌యోగం త‌ర్వాత ఎస్ఎస్ఎల్‌వీ కోసం లాంచ్‌ప్యాడ్‌ను త‌యారు చేయ‌నున్న‌ట్లు విక్ర‌మ్ సారాభాయ్ స్పేస్ సెంట‌ర్ డైర‌క్ట‌ర్ ఎస్ సోమ‌నాథ్ పేర్కొన్నారు.

వ‌చ్చే నెల‌లో పీఎస్ఎల్వీ సీ49ను ప‌ది శాటిలైట్ల‌తో ప్ర‌యోగించ‌నున్నారు. ఆ రాకెట్‌తో రీశాట్‌-2బీఆర్‌2 ఉప‌గ్ర‌హం, ఇత‌ర క‌మ‌ర్షియ‌ల్ శాటిలైట్ల‌ను ప్ర‌యోగిస్తారు. డిసెంబ‌ర్‌లో పీఎస్ఎల్వీ సీ50, జీశాట్‌-12ఆర్ శాటిలైట్ల‌ను కూడా ప్ర‌యోగించ‌నున్నారు. ఘ‌న ఇంధ‌నం ద్వారా మూడు ద‌శ‌ల ఇంజిన్ క‌లిగిన ఎస్ఎస్ఎల్వీ రాకెట్‌ను ప్ర‌యోగించ‌నున్న‌ట్ల సోమ‌నాథ్ తెలిపారు.

34 మీట‌ర్ల పొడుగు ఉండే ఆ రాకెట్ బ‌రువు సుమారు 120 ట‌న్నులు ఉంటుంది. వివిధ క‌క్షల్లో శాటిలైట్ల‌ను లాంచ్ చేసే సామ‌ర్థ్యం ఆ రాకెట్‌కు ఉన్న‌ట్లు శాస్త్రో శాస్త్ర‌వేత్త‌లు అంటున్నారు. ఎస్ఎస్ఎల్వీ సుమారు 500 కిలోల పేలోడ్‌ను లో ఎర్త్ ఆర్బిట్‌లోకి మోసుకువెళ్ల‌గ‌ల‌దు. ఎస్ఎస్ఎల్వీ రాకెట్‌ను 120 కోట్ల ఖ‌ర్చుతో రూపొందిస్తున్నారు.

Tags :
|
|

Advertisement