Advertisement

  • ఇస్రోలో ప్రైవేట్ సంస్థల భాగస్వామ్యం ..కొత్త శకానికి నాంది అన్న చైర్మన్ శివన్

ఇస్రోలో ప్రైవేట్ సంస్థల భాగస్వామ్యం ..కొత్త శకానికి నాంది అన్న చైర్మన్ శివన్

By: Sankar Thu, 25 June 2020 3:27 PM

ఇస్రోలో ప్రైవేట్ సంస్థల భాగస్వామ్యం ..కొత్త శకానికి నాంది అన్న చైర్మన్ శివన్



ఇప్పటివరకు కేవలం ప్రభుత్వ రంగంలోనే నడుస్తున్న ఇస్రో లో ఇక నుంచి ప్రైవేట్ సంస్థలు కూడా భాగస్వామ్యం అవుతాయని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పడంతో దీనిపైనా ఇస్రో చైర్మన్ శివన్ స్పందించాడు .. ఈ సంస్కరణలు కొత్త శకానికి నాంది పలుకుతాయని ఆయన వ్యాఖ్యానించారు. ‘అంతరిక్ష రంగంలో ప్రభుత్వం ఎన్నో స్ఫూర్తి వంతమైన సంస్కరణలు తీసుకొచ్చింది. వీటి ద్వారా ఒనగూడే ప్రయోజనాలతో యువత లబ్ధి పొందుతుందని ఆశిస్తున్నాను. ఇప్పటికే ఎన్నో స్టార్ట్‌ అప్ కంపెనీలు అంతరిక్ష రంగంలోకి ప్రవేశించేందుకు ముందుకు వచ్చాయి. ఈ రంగంలో భారత్ ప్రపంచంలోనే అగ్రగామిగా నిలుస్తుందని భావిస్తున్నాను’ అని ఆయన వ్యాఖ్యానించారు.

గ్లోబల్ స్పేస్ ఎకానమీలో భారత్ ఓ హబ్‌గా తీర్చిదిద్దేందుకు ప్రైవేటు సంస్థలు ముందుకు రావాలని ఆయన పిలుపు నిచ్చారు. ‘అంతరిక్ష రంగంలో అవకాశాల ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న ప్రజల నైపుణ్యాలను వినియోగించుకుని ఈ నూతన సాంకేతికతను, తద్వారా వచ్చే లాభాలను మరింత విస్తృతపరచవచ్చు. దీని వల్ల ఆ రంగం అభివృద్ధి చెందడమే కాకుండా భారత సంస్థలు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందవచ్చు’ అని శివన్ వ్యాఖ్యానించారు.

భారత అంతరిక్ష రంగంలో ప్రైవేటు సంస్థలను ఆహ్వానించేందుకు భారత్ ప్రభుత్వం అనేక కీలక నిర్ణయాలు తీసుకున్న విషయం తెలిసిందే. ప్రైవేటు సంస్థలను ప్రోత్సహించేందుకు ఇన్ స్పేస్ పేరిట కొత్త సంస్థను ఏర్పాటు చేసేందుకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఈ రంగంలో ప్రైవేటు సంస్థలకు సమానావకాశాలు కల్పించేందుకు ఇన్ స్పేస్ కృషి చేస్తుందని ప్రధాని మోదీ తెలిపారు. ప్రైవేటు రంగం, విద్యారంగం, ప్రభుత్వ ప్రతినిధులకు ఈ సంస్థలో సభ్యత్వం ఉంటుందని, త్వరలో ఇస్రో..ఇన్‌స్పేస్‌తో నూతన సాంకెతికతను పంచుకోవడం ప్రారంభిస్తుందని కూడా మోదీ తెలిపారు.



Tags :
|
|

Advertisement