Advertisement

  • బ్రిటన్లో న్యూ కరోనా వైరస్ విజృంభణతో కీలక నిర్ణయం తీసుకున్న ఇజ్రాయెల్ ప్రధాని

బ్రిటన్లో న్యూ కరోనా వైరస్ విజృంభణతో కీలక నిర్ణయం తీసుకున్న ఇజ్రాయెల్ ప్రధాని

By: Sankar Tue, 22 Dec 2020 11:14 AM

బ్రిటన్లో న్యూ కరోనా వైరస్ విజృంభణతో కీలక నిర్ణయం తీసుకున్న ఇజ్రాయెల్ ప్రధాని


ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభణ కొద్దిగా తగ్గుముఖం పడుతుంది ఆనందపడుతున్న లోపే మరొక వైరస్ విజృంభణ ప్రారంభం అయింది ..ఈ వైరస్ దెబ్బకు బ్రిటన్ లో కఠిన ఆంక్షలు విధించారు..దీనితో ప్రపంచంలోని ఇతర దేశాలు కూడా బ్రిటన్ నుంచి వచ్చే ఫ్లైట్స్ మీద ఆంక్షలు విధిస్తున్నాయి ...

తాజాగా బ్రిటన్‌లో కరోనా న్యూ వైరస్‌ స్ట్రెయిన్ వెలుగు చూడటంతో ఇజ్రాయెల్‌ కీలక నిర్ణయం తీసుకున్నది. విదేశీ విమాన ప్రయాణికుల రాకను నిరోధించేందుకు విమానాలను విమానాశ్రయాలకు పరిమితం చేయనున్నది. కరోనా వైరస్‌ ఎక్కువ మందికి సోకకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు సోమవారం తెలిపారు.

‘న్యూ మహమ్మారి వ్యాపిస్తున్నదని మేం తెలుసుకున్నాం. ఇది ఏమిటో నిజంగా మాకు తెలియదు. ఇది కరోనా వైరస్‌ 2 కావచ్చునని జెరూసలేంలో జరిగిన మొక్కల ప్లాంటేషన్‌ కార్యక్రమంలో చెప్పారు. బ్రిటన్‌, డెన్మార్క్‌, దక్షిణాఫ్రికా దేశాల్లో న్యూ కరోనా వైరస్‌ను కనుగొనడంతో బ్రిటన్‌ నుంచి విదేశీయుల రాకపై ఇజ్రాయెల్‌ నిషేధం విధిస్తూ ఆదివారం నిర్ణయం తీసుకున్నది.

Tags :
|
|

Advertisement