Advertisement

ఆ దేశంలో రెండో సారి కఠినమైన లాక్ డౌన్ ప్రకటన ...

By: Sankar Mon, 14 Sept 2020 09:06 AM

ఆ దేశంలో రెండో సారి కఠినమైన లాక్ డౌన్ ప్రకటన ...


దేశవ్యాప్తంగా కరోనా వైరస్ కేసుల సంఖ్య భారీగా పెరుగుతుండటంతో మూడువారాల లాక్‌డౌన్ విధిస్తున్నట్లు ఇజ్రాయెల్ ప్రభుత్వం ప్రకటించింది. రెండవసారి వైరస్ సంక్రమణను అడ్డుకునేందుకు ఈ సంచలన నిర్ణయం తీసుకుంది. మూడు వారాల పాటు కఠినమైన లాక్‌డౌన్ కు కేబినెట్ అంగీకరించిందని, దీనిని పొడిగించే అవకాశం కూడా ఉందని దేశ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు ఆదివారం ప్రకటించారు. రోజుకు 4వేలకు పైగా కొత్త కేసులు నమోదు అవుతున్నాయనీ దీన్ని అరికట్టాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.

దేశంలో క‌రోనా కేసులు, మ‌ర‌ణాలు భారీగా పెరుతుండ‌డంతో సెప్టెంబ‌ర్ 18నుంచి రెండు వారాల లాక్‌డౌన్ కొన‌సాగ‌నుంది. లాక్‌డౌన్ కాలంలో సూపర్ మార్కెట్లు, ఫార్మసీలు వంటి అత్యస‌ర‌ సేవ‌లు మిన‌హా ఉదయం 6 గంటలకు వరకు పూర్తిస్థాయి ఆంక్షలు అమల్లోకి రానున్నాయి. ముఖ్యంగా దేశంలోని అన్ని పాఠశాలలు, కిండర్ గార్టెన్‌లు రెండు రోజుల ముందుగానే సెప్టెంబర్ 16న మూసివేస్తారు..

అయితే యూదుల నూతన సంవత్సరం ముఖ్యమైన సెలవుల ప్రారంభానికి కొన్ని గంటల ముందు ప్రధానంగా ప్రాయశ్చిత్త దినం, సుక్కోట్ ముందు వెలువడిన ఈ నిర్ణయంపై తీవ్ర నిరసర వ్యక్తమవుతోంది. తాజా నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ హౌసింగ్ మంత్రి యాకోవ్ లిట్జ్మాన్ రాజీనామా చేశారు, ఇది ఇజ్రాయెల్ యూదులకు అగౌరవమని ఆయన అన్నారు.


Tags :
|

Advertisement