Advertisement

  • 2013 ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత ధోని అంటే ఏంటో తెలిసింది ..ఇషాంత్ శర్మ

2013 ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత ధోని అంటే ఏంటో తెలిసింది ..ఇషాంత్ శర్మ

By: Sankar Sat, 04 July 2020 1:40 PM

2013  ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత ధోని అంటే ఏంటో తెలిసింది ..ఇషాంత్ శర్మ



మహేంద్ర సింగ్ ధోని ..ఇండియన్ క్రికెట్లో సువర్ణాక్షరాలతో లికించే పేరు ..ఆటగాడిగా , కెప్టెన్ గా గత పదిహేను సంవత్సరాలుగా ఎంతగానో రాణిస్తున్నాడు ...బౌలర్ల మదిలో ఏముందో పసిగట్టి దానికి తగ్గట్లే ఫీల్డింగ్ ఆరెంజ్ చేయడం , బాట్స్మన్ మైండ్ ను రీడ్ చేయడంలో ధోని దిట్ట ..మరి అలాంటి ధోని గురించి తెలుసుకోవడానికి తనకు ఆరేళ్ళు పట్టింది అంటున్నాడు టీం ఇండియా ఫాస్ట్ బౌలర్ ఇషాంత్ శర్మ ..2007లో బంగ్లాదేశ్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌తో టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చినా ఇషాంత్ శర్మ.. కెరీర్ ఆరంభంలో ధోనీతో పెద్దగా మాట్లాడేవాడు కాదట. కానీ.. 2013 ఛాంపియన్స్ ట్రోఫీలో యువ క్రికెటర్లతో ధోనీ వ్యవహరిస్తున్న తీరుకి తాను ఫిదా అయిపోయినట్లు ఈ పేసర్ చెప్పుకొచ్చాడు. ఆ తర్వాతే ధోనీని అర్థం చేసుకోవడం తాను ప్రారంభించానని ఇషాంత్ శర్మ వివరించాడు.

స్టార్ స్పోర్ట్స్ షో ‘క్రికెట్ కనెక్టెడ్’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ధోనీతో ఉన్న సాన్నిహిత్యం గురించి ఇషాంత్ శర్మ మాట్లాడుతూ భారత్ జట్టులోకి వచ్చిన తొలినాళ్లలో ధోనీతో నేను పెద్దగా మాట్లాడేవాడిని కాదు. కానీ.. 2013 తర్వాత అతనితో నెమ్మదిగా మాట్లాడుతూ.. క్రమంగా అర్థం చేసుకోవడం ప్రారంభించా. యువ క్రికెటర్లతో ధోనీ చక్కగా మాట్లాడతాడు. మైదానంలోనే కాదు.. వెలుపల కూడా వారితో అలానే కూల్‌గా అతను వ్యవహరిస్తాడు. ఇంకా ఆసక్తికరమైన విషయం ఏంటంటే..? నా రూముకి రావొద్దు అని ధోనీ ఎవరితోనూ చెప్పడు. బౌలర్ మహ్మద్ షమీ ఎక్కువగా ధోనీ రూముకి వెళ్తుంటాడు. ధోనీతో మాట్లాడితే క్రికెట్ గురించే కాదు.. జీవితం గురించి కూడా చాలా నేర్చుకోవచ్చు అని ఇషాంత్ శర్మ వెల్లడించాడు.

కాగా 2013 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో ఇషాంత్ శర్మ భారీగా పరుగులు ఇచినప్పటికీ , ఇషాంత్ మీద నమ్మకం ఉంచిన ధోని చివర్లో కీలక ఓవర్ బౌలింగ్ చేసేందుకు ఇషాంత్ చేతికి బంతి ఇచ్చాడు ..అయితే కెప్టెన్ నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఇషాంత్ వరుస బంతుల్లో క్రీజులో కుదురుకున్న రవి బొపారా , మోర్గాన్ లను పెవిలియాన్ కు పంపి మ్యాచ్ ను భారత్ వైపుకు తిప్పాడు

Tags :
|
|
|

Advertisement