Advertisement

  • అర్జున అవార్డు అందుకోవడం చాలా ఆనందంగా ఉంది ..ఇషాంత్ శర్మ

అర్జున అవార్డు అందుకోవడం చాలా ఆనందంగా ఉంది ..ఇషాంత్ శర్మ

By: Sankar Sun, 30 Aug 2020 10:08 AM

అర్జున అవార్డు అందుకోవడం చాలా ఆనందంగా ఉంది ..ఇషాంత్ శర్మ


శరీరం సహకరించినంత కాలం క్రికెట్‌ ఆడతానని అర్జున అవార్డు విజేత, భారత పేసర్‌ ఇషాంత్‌ శర్మ అన్నాడు. ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) కోసం దుబాయ్‌ వెళ్లిన ఇషాంత్‌ శనివారం జరిగిన జాతీయ క్రీడా అవార్డుల వేడుకకు హాజరు కాలేకపోయాడు. అయినప్పటికీ ఈ ఏడాది అవార్డు గెలుపొందిన వారందరికీ అభినందనలు తెలిపాడు.

‘చిన్న వయస్సులోనే క్రికెట్‌పై నాకున్న ఇష్టాన్ని తెలుసుకున్నా. నాటి నుంచి ఇప్పటివరకు ప్రతీ మ్యాచ్‌లోనూ 100 శాతం ప్రదర్శన కనబరిచా. 13 ఏళ్ల తర్వాత లభించిన ఈ అర్జున అవార్డు మరింత రాణించేందుకు కావాల్సిన స్ఫూర్తినిచ్చింది..ఈ గౌరవాన్ని అందుకోవడం చాలా ఆనందంగా ఉంది. ప్రతిష్టాత్మక పురస్కారానికి ఎంపిక చేసిన కేంద్ర మంత్రిత్వ శాఖకు కృతజ్ఞతలు. నా ప్రయాణంలో వెన్నంటే నిలిచిన బీసీసీఐకి ధన్యవాదాలు. ఈ ఏడాది అవార్డు గెలుపొందిన వారందరికీ అభినందనలు’ అని ఇషాంత్‌ ట్విట్టర్‌లో రాసుకొచ్చాడు.

కాగా ప్రస్తుత టీం ఇండియాలో టెస్ట్ ఫార్మటు లో కీలక బౌలర్ గా ఎదిగిన ఇషాంత్ శర్మ కెరీర్ లో అనేక ఎత్తు పల్లాలు ఉన్నాయి..తొలుత ఇండియన్ క్రికెట్ లోకి అరంగేట్రం చేసినప్పుడు తన బౌలింగ్ తో ఆస్ట్రేలియా స్టార్ ఆటగాడు దిగ్గజ పాంటింగ్ ను ముప్పు తిప్పలు పెట్టాడు ..దీనితో టీం ఇండియాకు ఒక అద్భుతమైన బౌలర్ దొరికాడు అని అనుకుంటున్నా సమయంలో గాడి తప్పాడు..ఆ తర్వాత తనలోని లోపాలను సరిచేసుకొని తనుతాను సరికొత్తగా ఆవిష్కరించుకొని ప్రస్తుత జట్టులో అత్యంత కీలక ఆటాగాడిగా ఎదిగి టీంమిండియాకు అద్భుత విజయాలను అందిస్తున్నాడు ...ఆ విజయాలకు సాక్షమే ఈ అర్జున అవార్డు..

Tags :
|
|

Advertisement