Advertisement

  • రష్యా అధ్యక్షుడు పుతిన్ త్వరలో పదవికి రాజీనామా చేయబోతున్నారా..? కారణం ఏంటి..?

రష్యా అధ్యక్షుడు పుతిన్ త్వరలో పదవికి రాజీనామా చేయబోతున్నారా..? కారణం ఏంటి..?

By: chandrasekar Fri, 06 Nov 2020 3:44 PM

రష్యా అధ్యక్షుడు పుతిన్ త్వరలో పదవికి రాజీనామా చేయబోతున్నారా..? కారణం ఏంటి..?


సుమారు ఇరవై ఏళ్ల నుంచి రష్యాను ఏకఛత్రాధిపత్యంగా ఏలుతున్న ఆ దేశాధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ త్వరలోనే తన పదవికి రాజీనామా చేయబోతున్నారని అంటున్నాయి రష్యన్ మీడియా వర్గాలు. ఆయన అరుదైన వ్యాధితో బాధపడుతున్నారని అది మొదటి దశలో ఉన్నదని పలు మీడియా కథనాలు వస్తున్నాయి. ఆ వ్యాధి నేపథ్యంలో ఆయన ఇక అధ్యక్ష పదవిలో కొనసాగడం అసాధ్యమని ఆయన సన్నిహితులు చెబుతున్నట్టు సమాచారం. వచ్చే ఏడాది జనవరిలో ఆయన తన పదవికి రాజీనామా చేయబోతున్నట్టు కూడా ఒక మీడియా సంస్థ సంచలన కథనం ప్రచురించింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్.. వచ్చే ఏడాది తన పదవికి రాజీనామా చేయబోతున్నారనే వార్త రష్యన్లకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నది. పుతిన్.. పార్కిన్సన్ వ్యాధితో బాధపడుతున్నారని సమాచారం. ఈ వ్యాధికి సంబంధించిన లక్షణాలు ఇప్పటికే పుతిన్ లో కనిపించాయని ఆయన వైద్యులు చెప్పినట్టు ఆ మీడియా కథనంలో రాసుకొచ్చింది. 68 ఏళ్ల పుతిన్ నిత్యం వ్యాయామం చేస్తూ ఫిట్ గా ఉంటారు. ఇప్పటికీ ఆయనకు గుర్రపు స్వారీ అంటే ఇష్టం. కాగా, ఆయనను ఇటీవల కొద్దిరోజులుగా పరీక్షిస్తున్న వైద్యులు పార్కిన్సన్ మొదటి స్టేజ్ లో ఉన్నట్టు తేల్చారని అది తెలిపింది. దీంతో ఆయన కుటుంబసభ్యులు, బంధువులతో పాటు అధికారగణం కూడా పుతిన్ ను పదవికి రాజీనామా చేసి ఇంట్లో విశ్రాంతి తీసుకోవాలని సూచిస్తున్నది.

పార్కిన్సన్ వ్యాధి..?

ఈ వ్యాధి వల్ల మెదడులోని నాడీ వ్యవస్థ దెబ్బతి౦టు౦ది. ముఖ్యంగా మన మెదడులో డోపమైన రసాయనం తయారుచేసే కణాలు దెబ్బతింటే ఈ వ్యాధి బారిన పడతారు. దీంతో చేతులు, కాళ్లు వణుకుతుంటాయి. మన పల్లెటూర్లలో కొంతమంది వృద్ధులు పదే పదే వణుకుతుంటే.. అప్పుడు ఎవరైనా ‘వణుకుడు రోగం ఉందా..?’ అంటుంటారు కదా.. అలాంటిదే ఇది. అయితే ఇది వయసు మీరిన వారికే వస్తుందట. ఈ వ్యాధి సోకిన వారి శరీరంలో క్రమంగా ఒక్కో పార్ట్ పనిచేయకుండా పోతుంది. చేతులు, కాళ్లు అలా పూర్తిగా మంచానికే పరిమితమయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం పుతిన్ కూడా ఇదే వ్యాధితో బాధపడుతున్నారట. ఆయన పెన్ను పట్టుకుని ఏదైనా రాసినప్పుడో టీ తాగేటప్పుడో చేతులు, వేళ్లు అదే పనిగా వణుకుతున్నాయట. కాగా, కొద్దిరోజుల కిందే రష్యాను బతికున్నంత కాలం తానే పాలించేలాగా రాజ్యాంగ సవరణకు ప్రతిపాదించిన విషయం తెలిసిందే. అందుకు అనుగుణంగానే అక్కడ పలు మార్పులు కూడా చోటు చేసుకున్నాయి. వీటన్నింటి నేపథ్యంలో పుతిన్ రాజీనామా చేస్తాననడంతో రష్యన్లు షాక్ కు గురవుతున్నారు.

Tags :
|
|

Advertisement