Advertisement

కాఫీ ఆరోగ్యానికి మంచిదేనా? ...,

By: chandrasekar Thu, 01 Oct 2020 12:20 PM

కాఫీ ఆరోగ్యానికి మంచిదేనా? ...,


International Coffee Day 2020: కాఫీ మీద ఎన్నో రకాల అపోహలు ఉన్నాయి. కొందరు కాఫీ ఆరోగ్యానికి మంచిది అని చెబితే.. మరికొందరు అస్సలు అలవాటు చేసుకోవద్దని అంటారు. మరి వీటిలో ఏది నమ్మాలి? ఏది నమ్మకూడదు?

మీకు కాఫీ తాగే అలవాటు ఉందా? అయితే, ఈ రోజు మీ రోజే. ప్రపంచవ్యాప్తంగా అక్టోబరు 1వ తేదీని అంతర్జాతీయ కాఫీ దినం (International Coffee Day 2020 ) గా పాటిస్తున్నారు. అయితే, ఈ రోజు కేవలం కాఫీ ప్రియుల కోసమే కాదు. కాఫీపై ఆధారపడుతున్న ఎంతో మంది రైతులను, కార్మికులను ప్రోత్సహించేందుకు ఈ ఇంటర్నేషనల్ కాఫీ డేని నిర్వహిస్తున్నారు.

ప్రపంచంలో చాలామందికి కాఫీ అంటే ఇష్టం. కొందరు దీన్ని వ్యసనంగా తాగేస్తుంటే.. మరికొందరు మాత్రం ఆరోగ్యాన్ని అందించే ఔషదంగా భావిస్తూ మితంగా తీసుకొంటున్నారు. మరికొందరికైతే కనీసం కాఫీ వాసన కూడా పడదు. రోజువారీ జీవితంలో కాఫీ కూడా భాగమైన నేపథ్యంలో. ఎన్నో అపోహలు నిత్యం షికారు చేస్తుంటాయి. వాటిలో కొందరు కాఫీ ఆరోగ్యానికి మంచిదని వాదిస్తే. మరికొందరు మంచి కాదు తాగొద్దని చెబుతుంటారు. అయితే, ఆ రెండు అభిప్రాయాలను కొట్టిపాడేయలేం. ఎందుకంటే.. కాఫీ ఆరోగ్యానికి చాలా మంచిది. కానీ, దాన్ని మితంగా తీసుకుంటేనే. దీన్ని రోజంతా అదే పనిగా తాగితే మాత్రం ముప్పు తప్పదు.

కాఫీ వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయి?

తగిన మోతాదులో కాఫీ తాగితే గుండె జబ్బులు, స్ట్రోక్స్, డయాబెటీస్ సమస్యలు ఉండవని తాజా స్టడీ ఒకటి పేర్కొంది.

* కాఫీ మెదడును ఫ్రెష్‌గా ఉంచుతుంది. శరీరానికి శక్తిగా అందించి ఉత్సాహాన్ని అందిస్తుంది.

* కాఫీ కేంద్ర నాడీ వ్యవస్థపై ప్రభావం చూపుతుంది. ఇది మెదడులో డోపామైన్ (న్యూరోకెమికల్)ను తయారు చేస్తుంది. దీనివల్ల ఏకాగ్రత పెరుగుతుంది.

* కాఫీలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరానికి హాని చేసే రోగాల నుంచి రక్షిస్తాయి. క్యాన్సర్ కణాలను సైతం నియంత్రిస్తాయి.

* మోతాదుకు తగిన కాఫీ తాగితే నరాల సమస్య (Parkinson's Disease) ముప్పును తగ్గిస్తుందని పరిశోధనల్లో తేలింది. కొన్ని అధ్యయనాల ప్రకారం.. కెఫిన్ ఈ ముప్పును 30 శాతానికి తగ్గిస్తోందని పేర్కొన్నాయి.

గమనిక: పై వివరాలన్నీ వివిధ స్టడీలు, ఆరోగ్య నిపుణుల సూచనల మేరకు అందించాం. మీరు కాఫీని డైట్‌గా తీసుకోవాలంటే.. వైద్యులు, ఆహార నిపుణుల సూచనలు తీసుకోవాలి. ముఖ్యంగా మీకు గుండె జబ్బులు, డయాబెటీస్ తదితర సమస్య ఉన్నట్లయితే తప్పకుండా వైద్యులను సంప్రదించి, వారు చెప్పే డైట్‌ను పాటించాలి. పైన పేర్కొన్న విషయాలన్నీ కేవలం మీ అవగాహన కోసమే అని గమనించవలసినదిగా మనవి.

Tags :
|

Advertisement