Advertisement

వర్ణ వివక్షపై ట్వీట్ చేసిన ఇర్ఫాన్ పఠాన్

By: chandrasekar Wed, 10 June 2020 4:58 PM

వర్ణ వివక్షపై ట్వీట్ చేసిన ఇర్ఫాన్ పఠాన్


వర్ణ వివక్షపై ప్రపంచ దేశాలు పోరాడుతున్న ఈ సమయంలో వర్ణ వివక్షపై ఇర్ఫాన్ పఠాన్ ట్వీట్ చేసారు. చర్మ వర్ణానికి మాత్రమే వివక్ష కాదన్నట్టు అయన ట్వీట్లో తెలియజేసారు. అమెరికాలో పోలీసు దుశ్చర్యకు ఆఫ్రికన్ అమెరికన్ జార్జ్ ఫ్లాయిడ్ మృతి చెందడంతో వర్ణ వివక్షపై ప్రపంచ వ్యాప్తంగా చర్చ జరుగుతున్నది.

వివక్షకు వ్యతిరేకంగా ఉద్యమం ఉధృతంగా జరుగుతున్నది. క్రీడాకారులు సైతం పెద్ద సంఖ్యలో ఈ విషయంపై స్పందిస్తున్నారు. తాజాగా టీమ్ ఇండియా మాజీ ఆల్ రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ సైతం వివక్ష అంశంపై గళమెత్తాడు. వివక్ష కేవలం వర్ణానికే పరిమితం కాలేదని, మతం పట్ల కూడా ఉందంటూ మంగళవారం ట్వీట్ చేశాడు.

అమెరికాలో మాత్రమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా అనేక రకాలుగా ప్రజలు వివక్షకు గురవుతున్నారు. చర్మ వర్ణానికే వివక్ష పరిమితం కాలేదు. విభిన్న నమ్మకం(మతం) కలిగి ఉన్నారనే కారణంగా సమాజంలో ఓ ఇల్లు కొననివ్వకపోవడం కూడా వివక్షలో భాగమే అని ఇర్ఫాన్ ట్వీట్ చేశాడు. కాగా తన కెరీర్ లో 29 టెస్టులు, 120 వన్డేలు, 24 టీ20లు ఆడిన పఠాన్ జట్టుకు దూరమైన చాలా కాలం తర్వాత ఈ ఏడాది మొదట్లో క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు.

Tags :
|
|

Advertisement