Advertisement

  • నన్ను బ్యాటింగ్ ఆర్డర్లో పైకి పంపింది ఛాపెల్ కాదు ..ఆ స్టార్ ఆటగాడు ..ఇర్ఫాన్ పఠాన్

నన్ను బ్యాటింగ్ ఆర్డర్లో పైకి పంపింది ఛాపెల్ కాదు ..ఆ స్టార్ ఆటగాడు ..ఇర్ఫాన్ పఠాన్

By: Sankar Tue, 30 June 2020 7:21 PM

నన్ను బ్యాటింగ్ ఆర్డర్లో పైకి పంపింది ఛాపెల్ కాదు ..ఆ స్టార్ ఆటగాడు ..ఇర్ఫాన్ పఠాన్



ఇర్ఫాన్ పఠాన్ ..ఇండియన్ క్రికెట్ లో స్టార్ క్రికెటర్ గా ఒక వెలుగు వెలిగి అంతలోనే కనుమరుగు అయిన ఆటగాడు ..గ్రెగ్ ఛాపెల్ హయాంలో ఇండియాకు ఆడిన పఠాన్ , ఛాపెల్ వల్లనే బ్యాటింగ్ మీద ద్రుష్టి పెట్టి బౌలింగ్ ను పట్టించుకోకపోవడం వలన టీంలో చోటు కోల్పోయాడు అని చాలా మంది అభిమానులు భావించారు ..

అయితే తనను బ్యాట్స్‌మన్‌గా ప్రమోట్ చేసింది సచినే తప్ప గ్రెగ్ చాపెల్ కాదని టీమిండియా మాజీ ఫాస్ట్ బౌలర్ ఇర్ఫాన్ పఠాన్ వెల్లడించాడు. 2005లో శ్రీలంకలో నాగ్‌పూర్‌తో జరిగిన తొలి వన్డేలో ఇర్ఫాన్ బ్యాట్స్‌మన్‌గా బరిలోకి దిగి చెలరేగిపోయాడు. 70 బంతుల్లో 83 పరుగులు చేసి శ్రీలంక బౌలర్లను ఆటాడుకున్నాడు. ఈ మ్యాచ్‌లో భారత్ 152 పరుగుల తేడాతో శ్రీలంకను చిత్తు చేసింది. ఆ తర్వాత పలుమార్లు పఠాన్ టాప్ ఆర్డర్‌లో బ్యాటింగ్‌కు దిగాడు. చాలాసార్లు ఇన్నింగ్స్‌ను ప్రారంభించాడు.

నేను నా రిటైర్‌మెంట్ ప్రకటించిన తర్వాత ఇదే విషయాన్ని చెప్పాను. నన్ను ఆల్‌రౌండర్‌గా మూడో స్థానంలో పంపి చాపెల్ తన కెరియర్‌ను నాశనం చేశాడని చాలా మంది భావిస్తారు. అయితే, నిజానికి నన్ను మూడో నంబరులో పంపాలన్నది సచిన్ ఆలోచన. నన్ను ఆ స్థానంలో పంపాలని ద్రవిడ్‌కు సచిన్ సూచించాడు. ‘అతడికి సిక్సర్లు కొట్టే సత్తా ఉంది. కొంత బంతిని ఎదుర్కోగలడు. ఫాస్ట్ బౌలర్లను చక్కగా ఆడగలడు కూడా’ అని ద్రవిడ్‌కు సచిన్ చెప్పినట్టు పఠాన్ ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు.

Tags :
|

Advertisement