Advertisement

  • వయస్సు పెరిగే కొద్దీ ధోని కెప్టెన్ గా పరిణితి సాధించాడు ..ఇర్ఫాన్ పఠాన్

వయస్సు పెరిగే కొద్దీ ధోని కెప్టెన్ గా పరిణితి సాధించాడు ..ఇర్ఫాన్ పఠాన్

By: Sankar Mon, 29 June 2020 09:44 AM

వయస్సు పెరిగే కొద్దీ ధోని కెప్టెన్ గా పరిణితి సాధించాడు ..ఇర్ఫాన్ పఠాన్



మహేంద్ర సింగ్ ధోని ఇండియన్ క్రికెట్లో దిగ్గజ కెప్టెన్లలో ముందు వరుసలో ఉండే నాయకుడు ..అంతకుముందు గంగూలీ , అజహరుద్దీన్ వంటి దిగ్గజ కెప్టెన్లు ఉన్నపటికీ ..ధోని వచ్చిన తర్వాత టీమిండియా ఐసీసీ లో ఉన్న అన్ని మేజర్ టోర్నీలలో విజయాలు సాధించింది ..2007 టి ట్వంటీ వరల్డ్ కప్ , 2011 ప్రపంచ కప్ , 2013 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఇలా ఇంకో కెప్టెన్ ఎవ్వరికి సాధ్యం కానీ విధంగా అన్ని మేజర్ టోర్నీలలో ఇండియాను విజేతగా నిలిపాడు ..అయితే ధోని కెప్టెన్గా అనుభవం గడిచే కొద్దీ పరిణితి చెందాడు అని అన్నాడు టీమిండియా మాజీ అల్ రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ ..

ధోనీ కెప్టెన్సీలో అతడు 2007 టీ20 ప్రపంచకప్‌, 2013 చాంపియన్స్‌ ట్రోఫీ గెలిచిన భారత జట్లలో సభ్యుడిగా ఉన్నాడు. ‘2007లో జట్టు పగ్గాలు అప్పగించాక యువకుడిగా ఉన్న ధోనీ ఉత్సాహంగా కనిపించేవాడు. అప్పట్లో మమల్ని అదుపులో ఉంచుకునే ప్రయత్నం చేసేవాడు. వికెట్‌ కీపింగ్‌ స్థానం నుంచి ఆతృతగా పరిగెత్తుకుని వచ్చి బౌలర్లకు సలహాలిచ్చేవాడు.

కానీ 2013 వచ్చేసరికి సీన్‌ మారింది. బౌలర్లనే స్వీయ నియంత్రణలో ఉండేలా స్వేచ్ఛనిచ్చాడు. ఈ ఆరేళ్లలో వచ్చిన అనుభవంతో స్పిన్నర్లపై కూడా నమ్మకాన్ని పెంచుకున్నాడు. చాంపియన్స్‌ ట్రోఫీలో వారిపై పూర్తి భరోసా ఉంచుతూ కీలక సమయంలో బరిలోకి దింపి వికెట్లు పడేలా చూశాడు. ఈ రెండు మెగా టోర్నీల సందర్భంగా మా టీమ్‌ సమావేశాలు 5 నిమిషాల్లోపే ముగిసేవి. 2013 వచ్చేసరికి అతడు చాలా ప్రశాంతంగా మారాడు’ అని స్టార్‌స్పోర్ట్స్‌ కార్యక్రమంలో ఇర్ఫాన్‌ పఠాన్‌ వివరించాడు.

Tags :
|

Advertisement