Advertisement

  • బౌలర్లకు రివర్స్ స్వింగ్ చేసుకునేందుకు ఏదయినా వస్తువు ఇవ్వాలి ..ఇర్ఫాన్ పఠాన్ ..

బౌలర్లకు రివర్స్ స్వింగ్ చేసుకునేందుకు ఏదయినా వస్తువు ఇవ్వాలి ..ఇర్ఫాన్ పఠాన్ ..

By: Sankar Tue, 14 July 2020 3:35 PM

బౌలర్లకు రివర్స్ స్వింగ్ చేసుకునేందుకు ఏదయినా వస్తువు ఇవ్వాలి ..ఇర్ఫాన్ పఠాన్ ..



కరోనా వైరస్‌ ఉధృతి తగ్గి పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చే వరకు పేసర్లు రివర్స్‌ స్వింగ్‌ను మర్చిపోవాలని భారత మాజీ పేసర్‌ ఇర్ఫాన్‌ పఠాన్‌ అభిప్రాయపడ్డాడు. ఇంగ్లండ్‌- వెస్టిండీస్‌ మధ్య ముగిసిన తొలి టెస్టులో జోఫ్రా ఆర్చర్‌ బౌలింగ్‌ను పరిశీలిస్తే తన వ్యాఖ్యలు అర్థమవుతాయని ఇర్ఫాన్‌ అన్నాడు. ‘ఉమ్మి రివర్స్‌ స్వింగ్‌కు దోహదపడుతుంది. ప్రస్తుతం ఉమ్మిపై నిషేధం ఉండడంతో ఏదైన ఇతర వస్తువుతో బంతిని రివర్స్‌ స్వింగ్‌ అయ్యేలా చేసేందుకు అనుమతి ఇవ్వాలి’ అని పఠాన్‌ కోరాడు.

అయితే కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో ఉన్న నేపథ్యంలో ఐసీసీ కొన్ని రూల్స్ కొత్తగా తెచ్చింది మరికొన్ని రూల్స్ లో మార్పులు చేసింది ..ఇందులో భాగంగానే ఇప్పటిదాకా రివర్స్ స్వింగ్ రాబట్టేందుకు బౌలర్లు ఉమ్మిని వాడేవారు ..దీనివలన ఒక వైపు బంతి మెరుపు పోయి రివర్స్ స్వింగ్ అయ్యేది ..దీనితో బౌలర్లకు వికెట్లు తీయడానికి కొంచెం అనుకూలంగా ఉండేది ..

అయితే కరోనా కారణంగా బంతి మీద ఉమ్మి వాడి రుద్దడాన్ని ఐసీసీ నిషేదించింది ..కావాలంటే ఉమ్మి బదులు చెమట వాడుకోవచ్చు అని తెలిపింది ..కానీ చెమట వాడటం వలన ఏ మాత్రం ఉపయోగం ఉండదు ..దీనితో ఇప్పటికే బాట్స్మెన్ కు అనుకూలంగా మారుతుంది అని విమర్శలు ఎదుర్కొంటున్న క్రికెట్ ..ఈ కరోనా కారణంగా ఇంకా బాట్స్మెన్ కు అనుకూలంగా మారింది ...

Tags :
|
|
|

Advertisement