Advertisement

  • భారత జట్టు కెప్టెన్‌ "కోహ్లీ" గురించి ఇన్‌స్టాగ్రామ్‌ లైవ్‌లో "ఇర్ఫాన్‌ పఠాన్‌"

భారత జట్టు కెప్టెన్‌ "కోహ్లీ" గురించి ఇన్‌స్టాగ్రామ్‌ లైవ్‌లో "ఇర్ఫాన్‌ పఠాన్‌"

By: chandrasekar Wed, 01 July 2020 10:34 AM

భారత జట్టు కెప్టెన్‌ "కోహ్లీ" గురించి ఇన్‌స్టాగ్రామ్‌ లైవ్‌లో "ఇర్ఫాన్‌ పఠాన్‌"


గంగూలీ కెప్టెన్ గా వున్నప్పుడు టీమిండిలోకి వచ్చి మంచి బౌలర్‌గా రాణించాడు ఇర్ఫాన్. నాయకత్వానికి అసలైన నిర్వచనం విరాట్‌ కోహ్లీ అని, అతని నాయకత్వంలో నేను ఆడివుంటే ఎంతో బావుండు అని టీమిండియా మాజీ ఫేసర్‌ ఇర్ఫాన్‌ పఠాన్‌ అన్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో లైవ్‌లో మాట్లాడుతూ భారత జట్టు కెప్టెన్‌పై తన అభిప్రాయాన్ని తెలియజేశాడు.

జట్టులోని ఆటగాళ్లను ప్రోత్సహించే నిజమైన నాయకుడు విరాట్‌ కోహ్లీ అని చెప్పాడు. నిజం చెప్పాలి అంటే విరాట్‌ కోహ్లీ నాయకత్వానికి నిజమైన నిర్వచనం అని అన్నాడు. అంతకు ముందు వేరే కార్యక్రమంలో మాట్లాడిన ఇర్ఫాన్ ధోని గురించి పలు విషయాలు చెప్పాడు.

ధోనిలో చాలా మార్పులోచ్చాయని తెలిపాడు. అతను చాలా ప్రశాంతంగా ఉంటాడని, అతడి నుంచి చాలా నేర్చుకున్నానని తెలిపాడు. పఠాన్‌ 2003లో గంగూలీ కెప్టెన్సీలో టీమిండిలోకి వచ్చి మంచి బౌలర్‌గా రాణించాడు. కొన్ని కీలక మ్యాచుల్లో బ్యాటింగ్‌లోనూ పరుగలు సాధించాడు. దాంతో ఆల్‌రౌండర్‌గా పేరు తెచ్చుకున్నాడు.

Tags :

Advertisement