Advertisement

  • లంక ప్రీమియర్ లీగ్ లో బరిలోకి దిగనున్న స్టార్ ఆల్ రౌండర్ ఇర్ఫాన్ పఠాన్

లంక ప్రీమియర్ లీగ్ లో బరిలోకి దిగనున్న స్టార్ ఆల్ రౌండర్ ఇర్ఫాన్ పఠాన్

By: Sankar Sun, 01 Nov 2020 6:38 PM

లంక ప్రీమియర్ లీగ్ లో బరిలోకి దిగనున్న స్టార్ ఆల్ రౌండర్ ఇర్ఫాన్ పఠాన్


ఇర్ఫాన్ పఠాన్.. టీమిండియాలో ఎన్నో సంచనాలు సృష్టించాడు. మరెన్నో విజయాలు అందించాడు. అటు బౌలింగ్.. ఇటు బ్యాటింగ్‌లోనూ రాణించి.. పర్‌ఫెక్ట్‌ ఆల్‌రౌండర్‌గా పేరుతెచ్చుకున్నాడు.

ప్రస్తుతం ఈ నెలలో జరగనున్న ఎల్‌పీఎల్ లీగ్ ‌లో టీమిండియా ఇర్ఫాన్ పఠాన్ ఆబోతున్నాడు. ఈ ఏడాది అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పడంతో విదేశీ లీగ్‌లో ఆడేందుకు అవకాశం లభించింది. ఈ క్రమంలోనే ఎల్‌పీఎల్‌లో కండీ టస్కర్స్‌తో ఒప్పందం చేసుకున్నాడు. తన రీఎంట్రీకి ఎల్‌పీఎల్ ఒక మార్గమని భావిస్తున్నట్లు ఇర్ఫాన్ పఠాన్ తెలిపాడు.

రెండేళ్లుగా క్రికెట్ ఆడనప్పటికీ.. ఆడగల సత్తా తనలో ఇంకా ఉందని వెల్లడించాడు. కరోనా వైరస్‌ కారణంగా రెండుసార్లు వాయిదా పడ్డ లంక ప్రీమియర్‌ లీగ్ ‌(ఎల్‌పీఎల్‌) ఈ నెల 14వ తేదీ నుంచి ఆరంభం కానుంది. ఈ లీగ్‌ ఆలస్యం కావడంతో క్రిస్‌ గేల్‌, డుప్లెసిస్‌ వంటి ఆటగాళ్లు అక్కడ ఆడేందుకు అవకాశం లభించింది.

Tags :
|

Advertisement