Advertisement

ఇంగ్లాండ్ పై సంచలన విజయం సాధించిన ఐర్లాండ్

By: Sankar Wed, 05 Aug 2020 09:55 AM

ఇంగ్లాండ్ పై సంచలన విజయం సాధించిన ఐర్లాండ్



ఇంగ్లాండ్ తో జరుగుతున్న మూడో వన్ డే లో ఐర్లాండ్ జట్టు సంచలన విజయం సాధించింది ..329 పరుగుల లక్ష్యాన్ని మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి సరిగ్గా యాబై ఓవర్లలో ఛేదించింది ..ఐర్లాండ్ జట్టులో ఓపెనర్ పాల్ స్టిర్లింగ్ కెరీర్ లోనే అద్భుతం అనదగ్గ ఇన్నింగ్స్ తో చెలరేగగా , అతనికి తోడుగా ఐర్లాండ్ కెప్టెన్బల్బీరినే రాణించాడు ..

ఈ ఇద్దరి ఆటగాళ్లు సెంచరీలతో చెలరేగారు..పాల్ స్టర్లింగ్ 142 పరుగులు చేయగా , బల్బీరినే 113 పరుగులతో రాణించాడు ..చివర్లో వీళ్ళు ఇద్దరు అవుట్ అయినప్పటికీ స్టార్ ఆటగాడు కెవిన్ ఒబ్రియాన్ , హరీ టెక్టర్ సహకారంతో ఐర్లాండ్ కు సంచలనం విజయాన్ని అందించాడు..

ఇక తొలుత టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న ఇంగ్లండ్‌ 49.5 ఓవర్లలో 328 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్‌ ఇయాన్‌ మోర్గాన్‌ (84 బంతుల్లో 106; 15 ఫోర్లు, 4 సిక్స్‌లు) దూకుడుగా ఆడి వన్డే కెరీర్‌లో 14వ సెంచరీ నమోదు చేశాడు. టామ్‌ బాంటన్‌ (51 బంతుల్లో 58; 6 ఫోర్లు, సిక్స్‌)తో కలిసి మోర్గాన్‌ నాలుగో వికెట్‌కు 146 పరుగులు జోడించాడు. చివర్లో విల్లీ (51; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు), టామ్‌ కరన్‌ (38 నాటౌట్‌; 4 ఫోర్లు) కూడా మెరిపించడంతో ఇంగ్లండ్‌ స్కోరు 300 పరుగులు దాటింది.

Tags :
|

Advertisement