Advertisement

ఇరాన్ సీనియర్ అణు శాస్త్రవేత్త హత్య

By: chandrasekar Sat, 28 Nov 2020 2:51 PM

ఇరాన్ సీనియర్ అణు శాస్త్రవేత్త హత్య


అణువాయిదాల వల్ల ప్రపంచానికి పెను ప్రమాదం ఉందని అందువల్ల దానిని నిర్ములించాలని అనేక సంస్థలు ప్రకటిస్తూ వున్నాయి. ఇప్పుడు ఇరాన్ లోని అత్యంత సీనియర్ అణు శాస్త్రవేత్త మొహ్సేన్ ఫఖ్రిజాదే హత్యకు గురయ్యారు. ఇరాన్ రాజధాని టెహ్రాన్ సమీపంలో కొందరు సాయుధులు చేసిన దాడిలో ఆయన చనిపోయినట్టు ఆ దేశ రక్షణ శాఖ ధృవీకరించింది. దమవాండ్ కౌంటీలోని అబ్సార్డ్‌లో జరిగిన దాడిలో తీవ్రంగా గాయపడిన ఫఖ్రిజాదే ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు.

ఇరాన్ జరిగిన ఈ హత్యను ఇరాన్ విదేశాంగ మంత్రి మొహమ్మద్ జావాద్ జరీఫ్ ఖండించారు. రహస్య ఇరాన్ అణ్వాయుధ కార్యక్రమం వెనుక ఉన్న కీలకమైన వ్యక్తి ఫఖ్రిజాదే అని పాశ్చాత్య దేశాల గూడచార సంస్థలు అనుమానిస్తూ వచ్చాయి. ఇరాన్ అణ్వాయుధాలను ఎంచుకుంటే, ఆ బాంబుకు పితామహుడిగా ఫఖ్రిజాదే అవుతారు అని ఒక పశ్చిమ దేశ దౌత్యవేత్త 2014లో రాయిటర్స్ వార్తా సంస్థతో అన్నారు. అయితే, తమ అణు కార్యక్రమం శాంతియుత ప్రయోజనాల కోసం మాత్రమేనని ఇరాన్ నొక్కి చెప్పింది. గత కొంతకాలంగా ఇరాన్ మరియు అమెరికా మధ్య కోల్డ్ వార్ కొనసాగుతున్న విషయం తెలిసిందే.

Tags :
|

Advertisement