Advertisement

  • కరోనా కేసులపై సంచలన వ్యాఖ్యలు చేసిన ఇరాన్ అధ్యక్షుడు హసన్ రౌహనీ

కరోనా కేసులపై సంచలన వ్యాఖ్యలు చేసిన ఇరాన్ అధ్యక్షుడు హసన్ రౌహనీ

By: chandrasekar Mon, 20 July 2020 1:28 PM

కరోనా కేసులపై సంచలన వ్యాఖ్యలు చేసిన ఇరాన్ అధ్యక్షుడు హసన్ రౌహనీ


ఇరాన్ లో ఇప్పటికే 2.5 కోట్ల మందికి కరోనా వైరస్ సోకి ఉంటుందని, తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే భవిష్యత్తులో ఈ సంఖ్య 5 కోట్ల వరకు చేరే అవకాశం ఉందని ఇరాన్ అధ్యక్షుడు హసన్ రౌహనీ సంచలన వ్యాఖ్యలు చేశారు. కరోనా కేసులు భారీగా పెరిగిపోతున్న నేపథ్యంలో రాజధాని టెహ్రాన్‌తో పాటు పలు నగరాలు, పట్టణాలలో మళ్లీ ఆంక్షలు విధించినట్లు తెలిపారు.

అతి చిన్న దేశంలో ఇంతమందికి కరోనా సోకిందా అంటూ ప్రపంచ దేశాలు ఇరాన్ అధ్యక్షుడు చేసిన వ్యాఖ్యలల్లో నిజనిజాలు తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. వాస్తవానికి శనివారం నాటికి ఇరాన్‌లో అధికారికంగా కరోనా బారిన పడిన వారి సంఖ్య 2,71,606. ఆరోగ్యశాఖ తాజా అధ్యయనంలో ఈ విషయాలు తెలిశాయని అధ్యక్షుడు రౌహనీ ప్రకటించారు.

దేని ఆధారంగా అధ్యయనం చేశారు, ఆ వివరాలు అధికారిక బులెటిన్‌లో ఎందుకు ప్రకటించడం లేదన్న అంశాలన్ని ఆయన ప్రస్తావించలేదు. రాబోయే రోజుల్లో మొత్తంగా 3 కోట్లు నుంచి 5 కోట్లు వరకు కరోనా సోకే ప్రమాదం ఉందన్నారు. 8.18 కోట్ల జనాభా కలిగిన దేశంలో 2.5 కోట్ల మందికి కరోనా సోకిందని ఓసారి, 3 నుంచి 5 కోట్ల మందికి కరోనా సోకే అవకాశముందని సైతం ఇరాన్ అధ్యక్షుడు హసన్ రౌహనీ ప్రకటించడం దేశ ప్రజలు ఆందోళనకు గురి అవుతున్నారు. మరోవైపు ఇరాన్‌లో కరోనా వ్యాప్తి పరిస్థితికి రౌహనీ మాటలు అద్దం పడుతున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.

Tags :

Advertisement