Advertisement

ఇరాన్ శాస్త్రవేత్త దారుణ హత్య

By: Sankar Sat, 28 Nov 2020 10:42 PM

ఇరాన్ శాస్త్రవేత్త దారుణ హత్య


ఇరాన్‌కు చెందిన ప్రసిద్ధ న్యూక్లియర్‌ శాస్త్రవేత్త మొహ్‌సేన్‌ ఫక్రీజాదే శుక్రవారం దారుణహత్యకు గురయ్యారు. టెహ్రాన్‌లో శివారులో తన వాహ‌నంలో వెళ్తున్న ఫ‌క్రిజాదేపై ఉగ్ర‌వాదులు కాల్పులు జ‌రిపారు.

అయితే తీవ్రంగా గాయ‌ప‌డ్డ ఫక్రీజాదే ఆసుపత్రిలో ప్రాణాలు విడిచారు. ఇరాన్ ర‌క్ష‌ణ‌శాఖ‌కు చెందిన రీస‌ర్చ్ అండ్ ఇన్నోవేష‌న్ ఆర్గ‌నైజేష‌న్ అధిప‌తిగా ఫ‌క్రిజాదే ప‌నిచేశారు.ఈ హత్య వెనుక ఇజ్రాయెల్‌ హస్తం ఉన్నట్లు ఇరాన్‌ ఆరోపించింది. ఈ సందర్భంగా ఇరాన్‌ విదేశాంగ మంత్రి మహ్మద్‌ జావేద్‌ జరీఫ్‌ ఐక్యరాజ్యసమితికి లేఖ రాశారు.

టెహ్రాన్‌లో హత్యకు గురైన మొహసేన్‌ వెనుక ఇజ్రాయెల్‌ హస్తం ఉందని.. అయితే హత్యకు సంబంధించి ఎలాంటి సాక్ష్యాదారాలు లేకుండా ఇరాన్‌ ప్రయత్నిస్తుందని లేఖలో తెలిపారు

Tags :

Advertisement