Advertisement

హైదరాబాద్ జట్టు రెడీ: ఎవరికెంత రెమ్యునరేషన్

By: Dimple Sun, 09 Aug 2020 11:17 PM

హైదరాబాద్ జట్టు రెడీ: ఎవరికెంత రెమ్యునరేషన్

జట్టులో ఐకమత్యం... క్రమశిక్షణకు మారుపేరు.... అదే సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌... ప్రత్యర్థితో సంబంధంలేకుండా... ఎవరిబాధ్యతవారిది... ఆటలో గెలుపే లక్ష్యం... ఐపీఎల్‌ చరిత్రలో సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌ది ప్రత్యేకస్థానం... ఐపీఎల్‌ లీగ్‌ దశల్లోనూ... ఫైనల్లోనూ దిగ్గజాలకు ముచ్చెమటలు పట్టించే సన్‌రైజర్స్‌ ఆటగాళ్లు ఈ సీజన్‌ను తమకు అనుకూలంగా మలచుకోవాలని చూస్తున్నారు. ఐపీఎల్‌ టోర్నమెంటులో ప్రత్యర్థి ఎవరైనాసరే సమర్థవంతంగా ఎదుర్కొనే సత్తా సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ సాధించినఫలితాలను రుజువు చేస్తుంది. మార్పులు.. చేర్పులతో జట్టును పటిష్టం చేసిన విలియంసన్‌... వార్నర్‌ సారథ్యానికి అండగా నిలవబోతున్నాడు. 2019 సీజన్‌కు కెప్టన్‌గా వ్యవహరించిన విలియంసన్‌... 2020 సీజన్‌కు డేవిడ్‌ వార్నర్‌ సారధ్య బాధ్యతలను వ్యవహరిస్తున్నాడు. 25 మందితోకూడిన హైదరాబాద్‌ జట్టు 24 మందితో దుబాయ్‌ వేదికలపై జరిగేఐపీఎల్‌ టోర్నమెంటుకు సిద్ధమైంది. సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌ ఫ్రాంచైజీ ఆటగాళ్లకోసం 74 కోట్ల 90 లక్షలరూపాయలను రెమ్యునరేషన్‌ రూపంలో ఇస్తోంది. దుబాయ్‌కి వెళ్లే ఆటగాళ్లలో ఆల్‌ రౌండర్లు ఎవరు... ఎవరెవరికి ఎంతెంత రెమ్యునరేషన్‌ ఇస్తున్నారనే సమాచారం ఇపుడు చూద్ధాం..!

దుబాయ్‌ వేదికలపై సంచలన విజయాలను నమోదుచేయడానికి సన్‌రైజర్స్‌ ఎదురుచూస్తోంది. బ్యాటింగ్‌ శైలి... బౌలింగ్‌ తీరు... జట్టు విజయాలకు ఢోకాలేదని... సన్‌ రైజర్స్‌ కెప్టన్‌ డేవిడ్‌ వార్నర్‌ ఆత్మవిశ్వాసంతో ఉన్నారు. ఐపీఎల్‌లో తిరుగులేనిశక్తిగా... ప్రత్యర్థులకు దడపుట్టించే జట్టు అన్ని విభాగాల్లోనూ పటిష్టంగా ఉంది. తన ఆటతీరుతో అభిమానుల్ని ఆకట్టుకుంటూ... జట్టు విజయాల్లో కీలక పాత్రపోషించిన కెప్టన్లుగా డేవిడ్‌ వార్నర్‌, కేన్‌ విలియంసన్‌ ప్రత్యేక గుర్తింపు సాధించారు. మైదానంలో మెరుపు ఇన్నింగ్స్‌ కాదు... అనుకువగా ఆట ఆడి.. ప్రత్యర్థులపై విజయం సాధించేందుకు వార్నర్‌ సేన సిద్ధంగా ఉంది. ‌ ప్రత్యర్థి బౌలర్లపై సింహలా విరుచుకుపడి... బ్యాట్‌ను ఝుళిపించి పరుగులప్రవాహంతో జూలు విదిల్చే డేవిడ్‌ వార్నర్‌... డేరింగ్‌ బ్యాట్స్‌ మెన్‌... ఒంటి చేత్తో మ్యాచ్‌ను మలుపుతిప్పిన మొనగాడుగా రికార్డును సొంతంచేసుకున్నాడు. క్లిష్ట పరిస్థితుల్లోనూ... క్రీజులో కడదాకా నిలబడి స్కోరు బోర్డును పరుగులు పెట్టించిన వార్నర్‌ సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌కు ఆణిముత్యంలా నిలిచాడు. దీంతో డేవిడ్‌ వార్నర్‌ ను సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌ ఫ్రాంచైజీ అత్యధికంగా 12 కటో్ల యాభైలక్షలరూపాయలను చెల్లిస్తోంది. యువసంచలనం... బ్యాటింగ్‌ స్పెషలిస్టు.... కీలక సమయాల్లో జట్టువిజయానికి బాటలు వేసిన ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్న మనీష్‌ పాండేకు 11 కోట్లు పారితోషికం అందిస్తోంది. బ్యాటింగ్‌తో మెరుపు ఇన్నింగ్స్‌తో ఆడే రషీద్‌ ఖాన్‌ జట్టుకు విలువైన పరుగుల్ని జోడించి అండగా నిలిచి ప్రాంచైజీ అభినందనలు అందుకుని తొమ్మిది కోట్ల పారితోషికం అందుకుంటున్నాడు. మ్యాచ్‌ ప్రారంభంనుంచే దిగ్గజ ఆటగాళ్లకు బుల్లెట్‌ లాంటి బంతుల్ని సంధించే భువనేశ్వర్‌ కుమార్‌ ఆటను మలుపు తిప్పిన సందర్భాలు చాలా ఉన్నాయి. బౌలింగ్‌ తోనే కాదు... బ్యాటింగ్‌ తోనూ కళ్లు చెదిరే సిక్సర్‌తో జట్టుకు విజయాన్ని అందించిన సందర్భాలు లేకపోలేదు. దీంతో భువనేశ్వర్‌ కుమార్‌కు 8 కోట్ల యాభైలక్షల రూపాయలను అందిస్తున్నారు. మాయాజాల బంతులతో బ్యాట్స్‌ మెన్లను ముప్పుతిప్పలు పెట్టే శార్థుల్‌ కౌల్‌కు మూడుకోట్ల ఎనభైలక్షల రూపాయలను అందిస్తున్నారు. ఆల్‌ రౌండర్‌ విజయ్‌ శంకర్‌ మూడుకోట్ల ఇరవై లక్షలు అందుకుంటున్నాడు. బౌలర్‌ షాబజ్‌ నదీమ్‌ మూడు కోట్ల ఇరవైలక్షలు తీసుకుంటున్నాడు. జట్టు విజయాల్లో బాధ్యతాయుత ఆటతీరుతో కేన్‌ విలియంసన్‌ అభిమానుల్ని ఆకట్టుకున్నాడు. క్రీజులో కుదురుకుంటే చాలు... తన బ్యాటింగ్‌ శైలితో పదునైన షాట్లతో స్కోరు బోర్డును పరుగులు పెట్టించి జట్టు విజయాల్లో భాగస్వామ్యమై అభినందనలు అందుకున్నాడు. విలియంసన్‌కు హైదరాబాద్‌ ఫ్రాంచైజీ మూడుకోట్ల రూపాలను పారితోషికంగా అందిస్తోంది. బౌలర్‌ సందీప్‌ శర్మ కు మూడుకోట్లు ఇస్తున్నారు. మరో బౌలర్‌ సయ్యద్‌ ఖలీల్ అహ్మద్‌కు మూడు కోట్లరూపాయలు అందిస్తున్నారు. జట్టుకు వికెట్‌ కీపర్‌ గా సేవలు అందిస్తూ... చురుకైన ఆటతీరుతో పటిష్టమైన బ్యాటింగ్‌ శైలి... మెరుపుషాట్లతో బౌండరీలు... సిక్సర్లతో హోరెత్తించే జానీ బెయిర్‌ స్టోకు రెండు కోట్ల ఇరవై లక్షలు పారితోషికంగా అందిస్తున్నారు.బ్యాటింగ్‌ తోనూ... బౌలింగ్‌తోనూ ఆటలో కీలకంగా వ్యవహరించే ఆల్‌ రౌండర్‌ మిచెల్‌ మార్ష్‌ రెండు కోట్ల రూపాయలను తీసుకుంటున్నాడు.

యువబ్యాట్స్‌ మెన్ ప్రియంగార్గ్‌ ఒక కోటి తొంబై లక్షల రూపాయలు అందుకుంటున్నాడు. మరో యువ బ్యాట్స్‌ మెన్‌ విరాట్‌ సింగ్‌కు ఒక కోటి తొంబైలక్షల రూపాయలను పారితోషికంగా ఇస్తున్నారు. వికెట్‌ కీపర్‌ గా కీలక పాత్ర... బ్యాటింగ్‌ శైలితో ఆకట్టుకునే ఆట... ఆడే వృద్ధిమాన్‌ సాహా... ఒక కోటి ఇరవైలక్షల రూపాలను అందుకుంటున్నాడు. ఆల్‌ రౌండర్‌ మహ్మద్‌ నబీ ఒక కోటి రూపాయలు తీసుకుంటున్నాడు. మరో వికెట్‌ కీపర్‌ శ్రీవత్స గోస్వామి ఒక కోటి రూపాయలు అందుకుంటున్నాడు. ప్రత్యర్థి ఆటగాళ్లను ఆటకట్టించే బౌలర్‌ బాసిల్‌ తంపి 95 లక్షల రూపాయలను తీసుకుంటున్నాడు. బ్యాట్స్‌ మెన్‌ అభిషేక్‌ శర్మ 55 లక్షల రూపాయలు అందుకుంటున్నాడు. బౌలింగ్‌ తో ఆకట్టుకునే బిల్లే స్టాన్‌ లకే కు యాభైలక్షల రూపాయలు ఇస్తున్నారు. ఆల్‌ రౌండర్‌ ఫ్యాబియన్‌ అల్లెన్‌కు యాభైలక్షలు ఇస్తున్నారు. ‌ పొట్టిక్రికెట్‌ స్పెషలిస్టు.. యువ బౌలర్ టి నటరాజన్‌కు నలభై లక్షలరూపాయలిస్తున్నారు. ఆల్‌ రౌండర్‌ సందీప్‌ భవనకకు ఇరవై లక్షలరూపాయలు , యువ ఆల్‌రౌండర్‌ సంజయ్‌ యాదవ్‌కు ఇరవైలక్షలు. మరో యువ ఆల్‌ రౌండర్‌ అబ్ధుల్‌ సమద్‌కు 20 లక్షలరూపాయలు అందిస్తున్నారు. దుబాయ్‌ వేదికలపై ప్రత్యర్థి జట్లతో జరిగే హోరాహోరీ మ్యాచుల్లో విజయాన్ని చేజిక్కించుకోవాలని ఎదురుచూస్తున్న వార్నర్‌ సేన ఆశయం సిద్ధించాలని ఆశిద్ధాం..!

Tags :
|
|
|
|

Advertisement