Advertisement

  • దుబాయ్‌లో మైదానాల్లో ఐపీఎల్‌ ప్రాక్టీస్‌ మ్యాచ్‌లు

దుబాయ్‌లో మైదానాల్లో ఐపీఎల్‌ ప్రాక్టీస్‌ మ్యాచ్‌లు

By: Dimple Fri, 28 Aug 2020 00:59 AM

దుబాయ్‌లో మైదానాల్లో ఐపీఎల్‌ ప్రాక్టీస్‌ మ్యాచ్‌లు

దుబాయ్‌లో జరుగనున్న ఐపీఎల్‌ మ్యాచుల్లో ఆడేందుకు చేరుకున్న ఎనిమిది జట్లు హుషారుగా కన్పిస్తున్నాయి. ఆరుజట్లు ఓ చోట... రెండు జట్లు ఓ చోట విడిది చేస్తున్నాయి. అయితే... ఐపీఎల్‌ కోసం వెళ్లిన ఆటగాళ్లకు నిబంధనలప్రకారం క్వారంటైన్‌ వ్యవధిని పూర్తిచేసుకున్న అందరూ... బయోబబుల్లోకి వచ్చేశారు. ఆటగాళ్లందరూ... నియంత్రిత పరిధిలోనే ఉంటున్నారు. ప్రాక్టీసు మ్యాచులకు మాత్రమే.... కేటాయించిన మైదానాల్లోకి రావడం... మిగిలిన సమయంలో నిర్థేశించిన వసతి ప్రాంగణాన్ని చేరుకుంటున్నారు. ప్రాక్టీస్‌ మ్యాచులతో ఆటగాళ్లనడుమ కొత్తవాతావరణం చోటుచేసుకుంది.

దుబాయ్‌ పరిసరాల్లో బస చేస్తున్న కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌, రాజస్థాన్ రాయల్స్‌, మైదానాల్లో సాధన మొదలు పెట్టాయి... సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌, చెన్నైసూపర్‌ కింగ్స్‌, రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు కసరత్తుకు దిగాయి. ఆబుదాబిలో విడిది చేస్తున్న కోల్కతా నైట్‌ రైడర్స్‌, ముంబై ఇండియన్స్‌ జట్లు ఆరు రోజుల నిర్భంధ క్వారంటైన్‌ పూర్తి చేసుకుని ప్రాక్టీసు మొదలుపెట్టాయి.

ప్రాక్టీసు మ్యాచుల్లో తలమునకలైన ఐపీఎల్ టీములు... షెడ్యూలు కోసం ఎదురుచూస్తున్నాయి. అయితే... సెప్టెంబరు 19 తేదిన ఐపీఎల్‌ ప్రారంభమ్యాచ్‌ లో డిపెండింగ్ ఛాంపియన్‌ ముంబై ఇండియన్స్‌... రన్నర్‌ చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్లు పోటీ పడబోతున్నాయి. అయితే... ఇండియాలోనే ఐపీఎల్‌ షెడ్యూలు రూపొందించిన బీసీసీఐకి... యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ లో నిబంధనలు కాస్త ఇబ్బందిగా మారాయి.

ఎనిమిది జట్ల నడుమ ప్రాథమికంగా నిర్వహింప తలపెట్టిన 56 మ్యాచుల్ని మూడు నగరాల్లో నిర్వహించేందుకు పరిస్థితుల్ని బట్టి విభజించారు. ఇందులో దుబాయ్‌ ఇంటర్నేషనల్‌ క్రికెట్‌ స్టేడియంలో 21 మ్యాచులు... అబుదాబిలో 21 మ్యాచులు, షార్జాలో 14 మ్యాచులు నిర్వహించాలని బీసీసీఐ షెడ్యూలుకు రూపకల్పన చేసింది. అయితే... అరబ్‌ ఎమిరేట్స్‌లో కోవిడ్‌ నిబంధనలు... ఐపీఎల్‌ నిర్వహణ జట్ల ప్రయాణాలకు ఇబ్బందికరంగా మారుతున్నాయి.

ఈ నేపథ్యంలో ముందస్తుగా రూపొందించుకున్న షెడ్యూలును ఖరారు చేయడానికి బీసీసీఐ తర్జనభర్జన పడుతోంది. యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ అధికార యంత్రాంగంతో చర్చించి... నిబంధనలు సడలించాలని బీసీసీఐ, ఐపీఎల్‌ ఉన్నత అధికారవర్గం ప్రయత్నిస్తోంది.

Tags :

Advertisement